తెలంగాణ వచ్చాక కూడా… పిల్లల సీట్లు, అందులోనూ మెడికల్ సీట్ల విషయంలో అదే అన్యాయం..? ఒకవైపు ఆంధ్రా ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చుకుని, ఆంధ్రా పిల్లలకు ప్రయోజనకరంగా వ్యవహరిస్తుంటే… తెలంగాణ సీట్లలో కూడా ఆంధ్రా పిల్లలే నిండుతుంటే కళ్లప్పగించి తెలంగాణ ఆరోగ్య యూనివర్శిటీ చూస్తూ ఊరుకుంది… ఇది అసమర్థతా..? నిర్లక్ష్యమా..? కుట్రా..? కేసీయార్ సర్కారుకు ఎందుకు పట్టలేదు..? పాలనానుభవం లేని జగన్ అంతగా చాకచక్యంగా జాగ్రత్తపడి, ఆంధ్రా సీట్లు తెలంగాణ పిల్లలకు పోకుండా చేసుకోగలిగితే… ఆ పని […]
మోడీ ప్లానింగు అంతే..! ఊదు కాలదు, పీరు లేవదు… తాజా కథ ఏమిటంటే..?!
ఊదు కాలదు, పీరు లేవదు…. కర్ర విరగదు, పాము చావదు… ఇలాంటివి ఎన్నో గుర్తొస్తయ్ కేంద్రంలోని బీజేపీ ప్లస్ ఏపీలో జగన్ ప్రభుత్వ ఆలోచనలు చూస్తుంటే… ఎవరో పెద్ద మనుషుల నడుమ కేసీయార్, చంద్రబాబు రాజీ కుదిరింది కాబట్టి ఇన్నేళ్లూ కేసీయార్ ‘వోటుకునోటు’ కేసును కోల్డ్ స్టోరేజీలో పెట్టేశాడు అనుకుందాం… ఇప్పటి పరిస్థితిలో తెలంగాణలో తెలుగుదేశం జీరో కాబట్టి, కేసీయార్‌కు ఆ కేసు తవ్వడం వల్ల వచ్చేదీ లేదు, పోయేదీ లేదు అనే విశ్లేషణే నిజమని అనుకుందాం… […]
తెగ నూరిన కత్తిని… హస్తినలో ఆ మోడీకే అప్పగించి… జీ హుజూర్…!!
దూరం నుంచి చూస్తే గులాబీ, కాషాయం రంగులు ఒకేలా కనిపిస్తాయి… తెలంగాణ రాజకీయ చిత్రపటం మీద వాటిని దగ్గర నుంచి చూసినా ఒకే తీరులో కనిపిస్తున్నయ్… కారణం సింపుల్… కాషాయ శిబిరంలో గాయిగత్తర లేపుతానన్న కేసీయార్ కాడికింద పడేశాడు… కాదు, కత్తే కింద పడేసిండు… అంతేకాదు, అచ్చు బీజేపీ ప్రభుత్వంలోలాగే అడుగులు వేస్తున్నాడు… చివరకు కొన్ని బీజేపీ శ్రేణులు కూడా ఊహించనంత..! ఎటొచ్చీ మా సారు కత్తులుకారాలు నూరి, మోడీకి ముచ్చెమటలు పట్టించి, అమిత్ షాను అడవుల్లోకి తరిమేస్తాడనుకుని… […]
‘‘సోనియా కూటమిలోకి కేసీయార్, జగన్’’…! మహాశ్చర్యంగా ఉందా..?!
‘‘హాఁ… హేమిటీ… సోనియా సారథ్యంలోని కూటమిలోకి జగన్, కేసీయార్ వచ్చి చేరాలా..?’’ అని హెడ్డింగు చదివి హాశ్చర్యపోయాచా..? అంతేలెండి… ఆ సంపాదకీయం రాసినవాడు, ఆ పత్రిక బాసు తప్ప దేశంలో ప్రతి ఒక్కరూ నోళ్లు వెళ్లబెట్టాల్సిందే… విషయం ఏమిటంటే..? ఊరందరిదీ ఓ దారి అయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్టుగా… శివసేన రాజకీయాల రూటే వేరు… అప్పుడంటే బాల్ ఠాక్రే ఉండేవాడు… చాలా కథలు పడేవాడు… హిందుత్వ చాంపియన్ అనే పేరుండేది… ఆ కథ వేరే ఉండేది… ఈ […]
తిరుపతిలో KCR, బండి సంజయ్ భుజంభుజం కలిపి… షూట్ చంద్రబాబు…
హమ్మయ్య, ఓ క్లారిటీ వచ్చేసింది… ఆప్టరాల్ అమిత్ షా… మరింత ఆఫ్టరాల్ కేసీయార్, జగన్… ఎంత దాచుకుంటేనేం..? ఢిల్లీలో జరిగిన వరుస ఆంతరంగిక, రహస్య, అత్యున్నత భేటీల పరమార్థం ఏమిటో కనిపెట్టడానికి ఆంధ్రజ్యోతులు, ఆంధ్రప్రభలు లేవా ఏం..? ఆ భేటీల్లో జగన్‌కు, కేసీయార్‌కు తిరుపతి ఉపఎన్నిక విషయంలో రెండు ప్రభుత్వాలూ ఎలా సహకరించాలో ఆదేశించి.., తెల్లారే బండి సంజయ్‌ను కూడా అర్జెంటుగా పిలిచి, దుబ్బాకలో బాగా చేశావోయ్, సేమ్, తిరుపతిలో అలాగే చేయి.., కేసీయార్, జగన్ సపోర్ట్ […]
అంతే హన్మన్నా… ప్రాంతీయ పార్టీ పెట్టు, పాదయాత్ర మొదలుపెట్టు…
రాహుల్ గాంధీ పదే పదే పార్టీలోని సీనియర్లే పార్టీకి శాపం, గ్రహణం అని ఎందుకు బాధపడుతూ ఉంటాడో చాలామంది అర్థం కావడం లేదు… మా బాసుకు ఏమిటీ పిచ్చి అని విసుక్కునే పార్టీ కేడర్ కూడా ఉన్నారు… కానీ వాళ్లకు కూడా ఈరోజు వీహెచ్ మాట్లాడిన మాటలు చూస్తే అర్థమైంది… ఇక మా పార్టీ బాగుపడటం కల్ల అనే నిరాశ కూడా కమ్మేసి ఉంటుంది… ఉన్న బలాన్ని కత్తిరించుకోవడంలో కాంగ్రెస్ తరువాతే ఏ పార్టీ అయినా..! నిజం… […]
బాబు బాగుంటేనే జగన్‌కు బలం… వింతగా ఉన్నా అదే సరైన సమీకరణం…
చంద్రబాబుకు తల్నొప్పి వంటి వోటుకునోటు కేసు మళ్లీ కదులుతోంది… ఉదయసింహా అరెస్టు… రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారని అనుకుంటున్న తరుణంలో… తెలంగాణలో కాంగ్రెస్‌ను, ఏపీలో చంద్రబాబును ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో బీజేపీ బిజీగా ఉన్నట్టుంది… జగన్‌తో, కేసీయార్‌తో అమిత్ షా మాటామంతీలో ప్రధానంగా ఇవి కూడా చర్చకొచ్చినట్టు ఓ సమాచారం… చంద్రబాబుకు సపోర్టుగా ఉండే సెక్షన్లను క్రమేపీ బీజేపీ ఫిక్స్ చేస్తోంది… అదే పని జగన్ కూడా చేస్తున్నాడు… బీజేపీతో సత్సంబంధాల కోసం చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నా […]
ఎల్ఆర్ఎస్ ఊబి..! ఫాఫం… నానాటికీ కూరుకుపోతున్న కేసీయార్…!
చెప్పింది పాత పద్ధతి, రిజిస్ట్రేషన్లు చేసేది మాత్రం కొత్త పద్ధతిలో..! మొరాయిస్తున్న సర్వర్లు.రోజుకు ఒక్కటి మాత్రమే స్లాట్ బుకింగ్… అయోమయంలో అమ్మకం దారులు. కొనుగోలుదారులు… రోడ్డున పడనున్న రైటర్ లు,స్టాంప్ వెండర్స్… ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు స్టాంప్స్ అవసరం లేదు… తెల్ల పేపర్ మీదనే రిజిస్ట్రేషన్… LRS లేని ప్లాట్స్ రిజిస్ట్రేషన్ కావు… Vacant లాండ్ టాక్స్ కడితేనే రిజిస్ట్రేషన్… రిజిస్ట్రేషన్ డాక్సుమెంట్లో పొడవు వెడల్పు కొలతలకు అవకాశం లేదు… సేల్ డీడ్ క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు… Ratification […]
జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు..? మొన్న కేసిఆర్, ఇప్పుడు జగన్… ఏమిటీ కథ..?!
జగన్ మళ్లీ అర్జెంటుగా ఢిల్లీ వెళ్తున్నాడు దేనికి..? అటు కేసీయార్‌ను పిలిపించి మాట్లాడిన మోడీషా వెంటనే జగన్‌ను ఎందుకు పిలుస్తున్నారు..? దానికీ దీనికీ లింకుందా..? వేర్వేరు అంశాలేనా..? కాళేశ్వరం, వరద సాయం గురించి కేసీయార్ వెళ్లాడు… పోలవరం, రెవిన్యూలోటు గురించి జగన్ వెళ్తున్నాడు అనే వార్తల్ని చిన్నపిల్లాడు కూడా నమ్మడు… అవి మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ఫస్ట్ పేజీల్లో రాసుకునే కొత్తతరహా జోకులు… అయితే ఈ భేటీల పరమార్థం ఏమిటో ఢిల్లీ జర్నలిస్టు సర్కిళ్లు, ఆయా పార్టీల్లోని […]
గండరగండడు కేసీయార్… అందరూ తనను అండర్ ఎస్టిమేట్ చేశారు…
సమకాలీన తెలంగాణ రాజకీయ నాయకుల్లో గండరగండడు కేసీయార్… ఏ అడుగు వేసినా, ఏం ఆలోచించినా అది పరులెవ్వరికీ అంతుపట్టని రాజకీయం… తను ఎవరికీ కొరుకుడు పడడు… చాలామందికి అసలు అర్థమే కాడు… బయట ప్రచారంలో ఉండేది వేరు… తన పయనించే బాట వేరు… తన ఢిల్లీ పర్యటన ఒక్కసారిగా పొలిటికల్ సర్కిళ్లను ఏం విశ్లేషించుకోవాలో అర్థం కాని అయోమయంలోకి నెట్టేసింది… కేసీయార్‌కు కావల్సింది కూడా అదే… జస్ట్, అలా సైలెంటుగా వెళ్లాడు… ప్రధానిని, అమిత్ షాను కలిసిన […]
అటోఇటో జానా…? నై జానా..? ఉంటే ఫాయిదా లేదు.., పోతే పోయేదీ లేదు…
జానారెడ్డి… ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పదే పదే వినిపిస్తున్న పేరు… సాగర్ ఎమ్మెల్యే నర్సింహయ్య మరణంతో… అక్కడి రాజకీయాల్లో మళ్లీ కాస్త కుదుపు… మళ్లీ తెర మీదకు జానారెడ్డి పేరు……. చాలా దూరం వెళ్లిపోయింది చర్చ… తను పార్టీ మారుతున్నాడు, టీఆర్ఎస్, బీజేపీ తనను చేర్చుకోవడానికి రెడీ అయిపోయాయి… బీజేపీ అయితే ఏకంగా తనకు గవర్నర్ పోస్టు ఇవ్వడానికి, తన కొడుకు రఘువీర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటానికి కూడా రెడీ అయిపోయిందని ఒక వార్త… ఎలాగూ […]
జగన్ ఆగడు… ఆ లిఫ్టు కట్టేస్తున్నాడు… శ్రీశైలం నీళ్లు మళ్లించేస్తాడట…
‘‘దటీజ్ జగన్… తను అనుకున్న లక్ష్యం దిశలో సోనియాగాంధీనే ధిక్కరించి, జైలుకు కూడా వెళ్లొచ్చినవాడు… కేసీయార్‌కు భయపడతాడా ఏం..?’’….. ఇలా కొందరికి అనిపించవచ్చుగాక..! ‘‘అబ్బే, ఇదంతా లోపాయికారీ అవగాహన బాసూ… జగన్, కేసీయార్ ఒకరి ప్రయోజనాల కోసం మరొకరు సహకరించుకుంటున్నారు… కేసీయార్ జగన్ కోసం తెలంగాణ ప్రయోజనాల్ని కూడా వదిలేశాడు, పైగా జనం కళ్లకు గంతలు కడతారు ఇద్దరూ…’’. ఇలా ఇంకొందరు అర్థం చేసుకోవచ్చుగాక…! ‘‘వైఎస్ శ్రీశైలం నీటిని సగం దోచుకుపోతే, జగన్ మొత్తానికే ఎసరు పెడుతున్నాడు […]
కేసుల భయం… BJP తో కాళ్లబేరం… KCR పై ఆంధ్రజ్యోతి ఫైరింగ్…
అల్టిమేట్ ఫోటో… నిజానికి ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు… ఒక దేశప్రధానిని కలిసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మర్యాదగా నమస్కారం పెట్టాడు… ప్రధాని కూడా అలాగే పద్దతిగా ప్రతినమస్కారం చేశాడు… బస్, ఇందులో ఇక ఈకలు పీకడానికి ఏముంది అంటారా..? కాదు… ఉంటుంది… రాజకీయాల్లో ప్రతి శాలువాకు, ప్రతి నమస్కారానికీ, ప్రతి పర్యటనకూ, ప్రతి దండకూ, ప్రతి దండానికీ, ప్రతి లేఖకూ కారణం ఉంటుంది… పంచిపెట్టే తిరుపతి ప్రసాదాలతో సహా ప్రతి దానికీ ఓ లెక్క […]
కేసీయార్ శాంతి మంత్రం..! తాజా అడుగుల పరమార్థం అదేనా..?!
…… కేసీయార్ భయపడుతున్నాడా..? తనపై బీజేపీ ఆధీనంలోని కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి వేధించబోతున్నదనే సందేహంలో పడ్డాడా..? అదేసమయంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను చల్లార్చే పనిలో పడ్డాడా..? లేక కేంద్రంతో మళ్లీ సత్సంబంధాలు కోరుకుంటున్నాడా… ? అది సాధ్యమేనా…? అ దశ దాటిందా..? బీజేపీ టైం చూసి వేటు వేసే ఆలోచనలో ఉందా..? ఇవన్నీ ప్రశ్నలు… ఎందుకు అంటే… ? పరిస్థితులు… వాటి ఆధారంగా వేసే అంచనాల క్రోడీకరణ… విశ్లేషణ… బీజేపీ అంతు చూస్తా, ఢిల్లీకి చేరి గాయిగత్తర […]
తెలంగాణ సన్నాల కథ ఒడిసింది… తెలంగాణ పత్తి బ్రాండింగ్ కథ షురూ…
కేసీయార్‌ను జనానికి దూరం చేసిన ఆ ఎల్ఆర్ఎస్, ఆస్తుల సర్వే, ధరణి వైఫల్యాలకు బాధ్యులెవరో ఫిక్స్ చేసి, వేటు వేయడం ఎంత అవసరమో… ఓసారి వ్యవసాయ అంశాల్లో కేసీయార్‌కు తప్పుడు సలహాలు ఇస్తున్న వారినీ గుర్తించి, వదిలించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది… నియంత్రిత వ్యవసాయ విధానం తప్పు… అది నష్టదాయకం, ప్రభుత్వమే బదనాం అవుతుంది, రైతు నష్టపోతాడు అని ‘ముచ్చట’ పదే పదే హెచ్చరించింది… ఇప్పుడు ఏమైంది…? సన్న ధాన్యం నువ్వు వేయమన్నావు..? మేం వేశాం… అదనపు ధర […]
హమ్మయ్య… ఇలా డబుల్ బెడ్రూం భారం దింపేసుకుందాం ఇక…
జనంలో విపరీతంగా ఆశలు పెంచి, ఆ ఆశలు భగ్నమై… కేసీయార్ పట్ల వ్యతిరేకతగా పరిణమిస్తున్న కొన్ని అంశాల్లో ప్రధానమైంది డబుల్ బెడ్రూం ఇళ్లు… ఈ హౌసింగ్ స్కీమ్ మీద కేసీయారే విపరీతమైన హైప్ క్రియేట్ చేశాడు… అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లను కట్టిన ఉమ్మడి దుష్ట పాలన రోజులంటూ తిట్టేసి.., పేదవాడు గర్వంగా, సౌకర్యంగా ఉండేలా ప్రభుత్వమే ఫ్రీగా కట్టించి ఇస్తుందని ప్రకటించాడు… ఎక్కడికి ఏ లీడర్ పోయినా ఈ ఇళ్ల ముచ్చట్లే… ఏ ఎన్నికలొచ్చినా ఈ వాగ్దానాలే… జనంలో […]
కేసీయార్ దిద్దుబాట..! జనాన్ని ముంచితే జనమూ ముంచేస్తారు మరి…
దెబ్బాక, గ్రేటర్ దెబ్బల తరువాత హఠాత్తుగా కేసీయార్లో అంతర్మథనం ప్రారంభమైనట్టు బోలెడు వార్తలు కనిపిస్తున్నయ్… బీజేపీ దూకుడు నిలువరించడానికి లెఫ్ట్, కాంగ్రెస్‌తో దోస్తీ అని ఒక వార్త… రెడ్లను మళ్లీ కాన్ఫిడెన్స్‌లోకి తెచ్చుకునే ప్రయత్నాలు అని మరో వార్త… జాతీయ స్థాయిలో బీజేపీతో పోరాటం అని ఇంకో వార్త…. అన్నీ రాజకీయ కోణాలే… కానీ నిజంగా తనను ఓడించింది ఎవరు..? ఎందుకు ఓడించారు..? తనను తప్పుదోవ పట్టించింది ఎవరు..? జనాదరణ ఎక్కడ గాడితప్పింది..? ఈ కోణం అక్కర్లేదా..? […]
మోడీ, ఒవైసీ… ఓ లాలూచీ కుస్తీ… ఓ పెద్ద కామ్రేడ్ డౌటనుమానం…
‘‘గత సంవత్సరం ఒకే దేశం-ఒకే ఎన్నిక అనే అంశం మీద చర్చించేందుకు ప్రధాని మోడీ ఓ అఖిలపక్ష సమావేశం పెట్టాడు… అందరినీ రమ్మన్నారు… సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శిగా నేను వెళ్లాం… మోడీ విధానాన్ని పార్టీ లైన్‌కు లోబడి నేను ఘాటుగా విమర్శించాను… అందరూ తమ అభిప్రాయాలు చెప్పి వెళ్లిపోయారు… మీటింగ్ అయిపోయింది… హాలులో ఓ చివర నేను, ఒవైసీ మిగిలిపోయాం… ప్రధాని వెళ్లిపోబోతూ మావైపు వచ్చాడు… నేను ఆశ్చర్యపోయాను… తను […]
షర్మిల నేతృత్వంలో… మళ్లీ తెలంగాణలో కదం తొక్కనున్న రెడ్లు…
బాజిరెడ్డీ… శివారెడ్డి చస్తే నువ్వు సీఎం అవుతావు… కానీ శివారెడ్డిని చంపితే నేరస్థుడివి అవుతావు… ఈ చిన్న లాజిక్ ఎలా మరిచిపోయావ్..?…….. ఈ డవిలాగు అదేదే మహేశ్ సినిమాలో చాలా పాపులర్…. ఈ ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీ వార్త చదివాక ఎందుకో గానీ ఆ డైలాగే గుర్తొస్తుంది… ఎందుకంటే… పక్కాగా ఇందులోనూ లాజిక్ రాహిత్యం స్పష్టంగా కనిపిస్తున్నది కనుక…. ఎస్; నిజమే… గాలి పోగేసి ఏదైనా మసాలా వంటకం చేయడంలో ఆంధ్రజ్యోతి ఏకాలం నుంచో ఫేమస్… అసలు […]
రేవంతుడికి రాధాకృష్ణుడి హెచ్చరికలు… చర్రున కాలడానికి కారణమేంటబ్బా?!
ఆమధ్య ఒకసారి చదివినట్టు గుర్తు… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణుడు తన కొత్తపలుకు వ్యాసంలో చంద్రబాబు, తెలుగుదేశం పేరు ప్రస్తావించకుండా, జగన్‌ను తిట్టకుండా తమాయించుకోవడం… మళ్లీ ఈరోజు కూడా అలాంటిదే చదివా… కాస్త లేటుగా, తాపీగా… ఆనందం వేసింది… అసలు చాలా గ్రేట్… జగన్‌ను ఆడిపోసుకోకుండా… చంద్రబాబును పొగడకుండా ఒక వ్యాసం రాయడం అంటే అది మామూలు పరీక్ష కాదు… ఆర్కే తొడుక్కున్న పచ్చ అంగీ, పెట్టుకున్న పచ్చటి కళ్లద్దాల పవర్ అలాంటిది మరి… బట్, ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు […]
- « Previous Page
- 1
- …
- 5
- 6
- 7
- 8
- 9
- Next Page »