దీన్నే బలుపు అంటారు… మరీ ఇంత హార్ష్ కామెంటా అని తిట్టుకున్నా సరే… జనం సొమ్ముతో లక్షల కోట్లకు ఎదిగి, ప్రపంచ ధనికుల్లో ఒకడిగా నిలిచినా సరే, ముఖేష్ అంబానీ జనానికి ఏమీ తిరిగి ఇవ్వడు అనే విమర్శ చాన్నాళ్లుగా ఉన్నదే కదా… చివరకు తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల వ్యయం కూడా సరిగ్గా చేయడు అంటారు… ఒక విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, ఒక టాటా రతన్, ఒక హెచ్‌సీఎల్ శివ నాడార్… ఇలా ఎందరో […]
అయినవారు కూడా అడుగుపెట్టని వాకిళ్లలో నివాసమే నేటి నాగరికత
ఇంటి ముందుకొచ్చే మనుషులు – మహమ్మద్ ఖదీర్‌బాబు రాలిన బాదంకాయల కోసం పిల్లలు వచ్చేవారు. ఎర్రగా పూసి, గోడ బయటకు తలవాల్చిన మందారాల కోసం యూనిఫాముల్లో ఉన్న ఆడపిల్లలు వచ్చేవారు. దేవుని పటాలకు కాదనేదెవరని నందివర్థనాల కోసం పక్కింటామె వచ్చేది. చనువున్న కాలేజీ స్టూడెంట్ కాదనడానికి వీల్లేని పద్ధతిలో రోజాపువ్వును తెంపుకెళ్లేది. రెండు చేతులున్న ప్రతి మహాలక్ష్మి గుప్పెడు గోరింటాకు కోసం హక్కుగా గేటు బాదేది. నాలుగు పుదీనా రెబ్బల కోసం ఎవరైనా రావచ్చు. చారెడు కరివేపాకుకు […]
కపట ప్రభుత్వ నేతల మాల్దీవుల్ని ఇంకా ఇంకా ఉద్దరించాలా మనం..?
‘ప్లీజ్, మా దేశానికి రండి, పర్యాటకం లేనిదే మా దేశం లేదు, మీరు రాకపోతే దివాలా తీస్తాం, మన దేశాల నడుమ బంధం చరిత్రాత్మకం, శాంతి-స్నేహాన్ని కోరుకుంటున్నాం’…. ఇలా మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీం తాజాగా మీడియా ద్వారా మొత్తుకుంటున్నాడు… ఈ దొంగ మాటల్ని ఇండియా నుంచి వెళ్లాలనుకునే టూరిస్టులు పట్టించుకోవాల్సిన పనిలేదు, అసలు అక్కడికి వెళ్లాల్సిన పనే లేదు… కడుపులో కత్తులు పెట్టుకున్న ప్రభుత్వ ముఖ్యులు అక్కడ… ఒకవైపు చైనాకు తొత్తుగా మారి, అపారమైన సముద్రజలాల్లో […]
ముడత మంచిదే..! ఇస్త్రీ చేయకపోతే ఏంటట..? అలాగే ధరిద్దాం…!
ఒక గంటపాటు లైట్లన్నీ ఆపేద్దాం… ధరిత్రికి అది మనం చూపించే కృతజ్ఞత… ఒక గంట విద్యుత్తు నిలిపేస్తే ఎంత శక్తి ఆదా అవుతుందో, తద్వారా ఎంత కాలుష్యాన్ని వాతావరణంలోకి పోకుండా ఆపగలమో, ఎంత భూతాపాన్ని నిలువరించగలమో లెక్కలతో సహా అప్పుడప్పుడూ ప్రచారాన్ని, పిలుపులను వింటుంటాం, చదువుతుంటాం, కొన్నిసార్లు పాటిస్తుంటాం కూడా… మంచిదే, అలాంటివి ఆహ్వానించాలి… ఏ చిన్న సత్సంకల్పమైనా సరే వ్యతిరేకించొద్దు, ప్రత్యేకించి సోషల్ మీడియాలో హెహె అని వెటకారపు ట్రోలింగూ అక్కర్లేదు… ఎప్పుడో ఓ గంట […]
సునీతా విలియమ్స్… గీత, గణపతి, సమోసాలను మించిన విశేషాలివి…
సునీతా విలియమ్స్… సాహసులకు, ప్రత్యేకించి మహిళలకు ఓ స్పూర్తి… నారీ శక్తి… మళ్లీ అంతరిక్షంలోకి వెళ్తోంది… అది అందరూ చదివారు వార్తల్లో… ఆమె అంతరిక్షంలోకి గీతను తీసుకుపోయింది, సమోసాను పట్టుకెళ్లింది వంటివే ప్రధానంగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి… కొన్ని చాలామందికి తెలియని ఇంట్రస్టింగ్ అంశాలు ఏమిటంటే..? (మూడోసారి ఆమెను అంతరిక్షంలోకి తీసుకెళ్లే యాత్ర సాంకేతిక కారణాలతో వాయిదాపడిందని తాజా వార్త…) ఆమె ఇండియాలో పుట్టలేదు… గుజరాత్‌కు చెందిన ఓ న్యూరోఅంటామిస్ట్ దీపక్ పాండ్యా అమెరికాకు పోయాడు అప్పుడెప్పుడో… […]
అవునూ… మోడీని పవన్ కల్యాణ్ ఆవహించాడా హఠాత్తుగా…
Murali Buddha వాల్ మీద కనిపించింది ఇది… అరివీర భయంకరమైన థంబ్ నెయిల్… టీవీ5 మెయిన్ స్ట్రీమ్ ఛానెలే… లోగోలో ఉన్నట్టు తెలుగు టీవీ న్యూస్ చానెళ్లలో అయిదో ప్లేసు కావచ్చు బహుశా… ‘‘రేయ్ రెడ్డీ… జగన్‌ను బొక్కలో తోస్తా’’ అని మోడీ జగన్‌ను హెచ్చరించినట్టు ఆ థంబ్ నెయిల్… అదీ అనకాపల్లి కూటమి సభలో… అవును మరి… సోషల్ మీడియా ప్రింట్, టీవీ మీడియాను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదే కదా… మరి యూట్యూబ్ చానెళ్లు ప్రవేశపెట్టిన దిక్కుమాలిన థంబ్ […]
బాడీయే బార్… పేగుల్లోనే బ్రూవరీ… కడుపులోనే నైన్టీ తయారీ…
మందు… మెడిసిన్ కాదు, మద్యం… తాగితే వ్యసనం… నాలుక ఊరుకోదు, టైమయితే చాలు ఎప్పుడెప్పుడు అంటూ నాలుక పిడచకట్టుకుపోతుంది… అలవాటు చేశావు కదా, ఏదీ పెగ్గు, రానియ్ రానియ్ అని గోలపెడుతుంది కాలేయం… ఆత్మారాముడు ఆవురావురు అంటుంటాడు… అప్పోసప్పో చేసెయ్, సీసా మూత తీసెయ్… వచ్చిన జీతం అధికశాతం బారులోనే హరీమంటుంది… పైగా రకరకాల వింత వింత పేర్లతో ప్రభుత్వమే ఎంకరేజ్ చేసే చీపెస్ట్ లిక్కర్, అనగా రంగుసారా… రిస్క్ చేస్తే కిక్కేమిటో గానీ కక్కు గ్యారంటీ, […]
దర్శకుడిగా 16 సినిమాలు… 14 సినిమాలకు జాతీయ అవార్డులు…
Sai Vamshi……. * నేను తీసిన ‘గులాబీ టాకీస్’ సినిమా చివర్లో ఒక టీవీ మీద కుక్క కూర్చుని ఉంటుంది. ఆ కుక్క దేనికి సంకేతం అని కొందరు అడిగారు. “కుక్క కుక్కకే సంకేతం” అని చెప్పాను. మరేదో సూచించడానికి నేను కుక్కని సింబల్‌గా పెట్టానని వాళ్ల ఊహ. అలాంటి లెక్కలు వేసుకుని సినిమా చూస్తే ఎలా? అందుకే “For the God Sake, Please don’t read Cinema. Watch it” అని నా అసిస్టెంట్లకు, […]
ముసలోళ్లు మాత్రమే కాదు, పడుచువాళ్లూ తప్పక చదవాల్సిన స్టోరీ…
Hideki wada… ఈయన ఓ Psychiatrist… గత మార్చిలో “80-Year-Old Wall” అని ఓ పుస్తకం రాశాడు… మార్కెట్లోకి రిలీజైంది… వేగంగా 5 లక్షల కాపీలు అమ్ముడైపోయాయి… ఈ వేగం ఇలాగే కొనసాగితే త్వరలోనే 10 లక్షల కాపీల మార్క్ సాధిస్తుంది… అంటే ఈ సంవత్సరం జపాన్‌లో అత్యధికంగా విక్రయించబడే పుస్తకం అన్నమాట… ఎవరీయన..? వృద్ధుల్లో వచ్చే మానసిక సమస్యలను ట్రీట్ చేసే డాక్టర్… 61 ఏళ్లు… గత 35 ఏళ్లలో 6 వేల మందిని ట్రీట్ […]
పారిపోవడం కూడా యుద్ధవ్యూహంలో ఓ భాగమే అంటారు పెద్దలు…
Subramanyam Dogiparthi….. పారిపోవటం కూడా యుధ్ధ వ్యూహంలో ఒక భాగమే అని ఈమధ్య వచ్చిన మహాభారతం సీరియల్లో శ్రీకృష్ణుడు చెపుతాడు . సీరియల్ అని ఎందుకు అన్నానంటే వ్యాస భారతంలో అన్నాడో, భాగవతంలో అన్నాడో నాకు తెలియదు . ప్రవచనకర్తలు జరాసంధుని గోల పడలేక కృష్ణుడు మధుర నుండి ద్వారకకు షిఫ్ట్ అయ్యాడని చెపుతుంటారు . సరే . ఇప్పుడు కలియుగ భారతానికి వద్దాం … పాపం రాహుల్ ! 2004 , 2009 , 2014 […]
ఎన్ఆర్ఐ అంటే దేశవ్యతిరేకా..? నటులంటే నాస్తికులా..? ఇవేం సూత్రీకరణలు..?!
‘‘ఒక అద్భుతమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ శాస్త్రవేత్తలు జ్యోతిష్యం మాట్లాడతారు. బాబాలు సైన్స్ బోధిస్తారు. పౌరాణికులు చరిత్ర రాస్తారు. సినీ నటులు భక్తిని వ్యాప్తి చేస్తారు. ధనవంతులు సాదా జీవనం గురించి పాఠాలు చెబుతారు. ప్రవాస భారతీయులు దేశాన్నెలా ప్రేమించాలో చెబుతారు. నేరగాళ్లు విలువలను బోధిస్తారు. రాజకీయ నాయకులు దేవుడి గురించి మాట్లాడతారు. దేవుడు మాత్రం నిశ్శబ్దం పాటిస్తాడు!’’ అని దేవులపల్లి కృష్ణశాస్రి అనే రచయిత ఫేస్బుక్ పోస్ట్‌లో ఆవేదన చెందాడు…. …. ఆంధ్రజ్యోతి పత్రికలో […]
ఎక్కడైనా అక్షింతలు అంటే బియ్యమే… ఆకాశం వర్షించే గింజలు కావు…
బీజేపీ హిందూ సంఘటన వ్యూహాల్ని ఎలా ఎదుర్కోవాలో బీఆర్ఎస్కు అస్సలు అర్థం కావడం లేదు, ప్రసంగాల్లో గందరగోళం కనిపిస్తోంది… అప్పుడే ఒక మాట, మళ్లీ అప్పుడే మరో మాట… కేడర్‌లోనూ అయోమయం నింపుతున్నారు… అన్నింటికన్నా ముందుగా… బీఆర్ఎస్కు మొన్నమొన్నటిదాకా మజ్లిస్ సెక్యులర్ పార్టీ, జాన్ జిగ్రీ… కానీ బీజేపీ మాత్రం మత పార్టీ… చేతనైతే బీజేపీ విధానాల్ని ఖండితంగా వ్యతిరేకించాలి, తప్పదు, తప్పులేదు, అది రాజకీయ అవసరం… అది అమాంతం మింగేయడానికి వస్తున్న అనకొండ… కానీ అటూఇటూ […]
ఆ పాత చంద్రబాబు నేడు లేడేమి..? అంత అనుభవంతోనూ ఈ కంగారేమి..?
Nancharaiah Merugumala….. జరగమంటే జరుగుతాడా, జగన్? జరగడానికి అది కుర్చీగాని.. బెంచీయో లేదా సోఫానో కాదే! ……………………………………………………………… ‘ జరుగు జరుగు జగన్–ఖాళీ చెయ్యి కుర్చీ ’…….. ఇదీ 14 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంగా రాజ్యమేలిన తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార ‘పిలుపు’. 2009 కడప లోక్ సభ ఎన్నికల నాటి నుంచీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోకడలను చూసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నినాదాలతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్ధం […]
బంగారంపై పిచ్చి అక్షయం… వ్యాపారుల టెక్నిక్కులు అ‘త్రితియం’…
కొత్త పండగ అక్షయ త్రితియ! అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ- అక్షయ తృతీయ రోజు పూజ చేస్తే కనకధార ఊరికే కురుస్తుందంటే కాదనాల్సిన పనిలేదు. అక్షయ తృతీయ రోజు ఏ దేవుడిని పూజించినా తరగని సంపద వస్తుందనేది ఇంకొంచెం బ్రాడర్ భక్తి సూత్రం. ఇదీ మంచిదే. అక్షయ తృతీయ […]
లాపతా లేడీస్‌లో ఆ సీన్… యానిమల్ కౌంటర్‌కు కిరణ్‌రావు రీకౌంటర్…
యానిమల్… వసూళ్లతో దున్నేసిన ఈ సినిమాపై బుద్ధిజీవుల విమర్శలు కూడా ఆ వసూళ్ల స్థాయిలోనే ఉన్నాయి… అర్జున్‌రెడ్డి దగ్గర నుంచీ దర్శకుడు వంగ సందీప్‌రెడ్డి మీద విమర్శలు ఆగలేదు కదా… కాకపోతే గతంలో సైలెంటుగా ఉండేవాడు… ఇప్పుడేమో తన సినిమాపై నేరుగానో, వ్యంగ్యంగానో వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరికీ తన భాషలోనే జవాబులు చెబుతున్నాడు… సరే, అవి కన్విన్సింగుగా ఉన్నాయా అనేది మన దృక్కోణాన్ని బట్టి ఉంటుంది… కానీ పెద్దగా వివాదాల తెర మీద కనిపించని ఆమీర్ […]
ఫలితాల అంచనాల్లో రవిప్రకాష్ సాహసం… నాలుగో ‘ఆర్’ అవుతాడా..?
ఆర్… రామోజీరావు ఈనాడు, ఆర్… రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి, ఆర్… రాజగోపాలనాయుడు టీవీ5… ట్రిపుల్ ఆర్… వీళ్లంతా జగన్ వ్యతిరేక శక్తులే… చంద్రబాబు అనుకూల వ్యక్తులే… బయటికి ఏం చెప్పుకోబడినా సరే, ప్రస్తుతం జగన్ అధికారాన్ని కూల్చాలని విశ్వప్రయత్నం చేస్తున్నవారే… అందరి సామాజికవర్గమూ ఒకటే… అందరూ జగన్ ప్రారంభించిన కులసమరంలో ఒకవైపుకు నెట్టేయబడినవారే… ఈ ట్రిపుల్ ఆర్కు మరో ఆర్ జతచేరుతుందా..? అదే సామాజికవర్గం… గతంలో అదే జగన్ వ్యతిరేకత… ఈ ఆర్ పేరు రవిప్రకాష్… టీవీ9 ఫౌండర్… […]
ఈయన ఇప్పటి ఏఆర్ రెహమాన్ కాదు, పాత ఎంఏ రెహమాన్…
Bharadwaja Rangavajhala….. త్యాగయ్య బర్త్ డే సందర్భంగా… రెహమాన్ గురించి… రెహమాన్ అనగానే ఏఆర్ రెహమాన్ అనుకుంటున్నారా కాదు… ఎమ్ఏ రెహమాన్ గురించి అన్నమాట… పాత సినిమాలు చూసేవాళ్లకు బాగా గుర్తుండే కెమేరా దర్శకుడు రెహమాన్. ఆయన పూర్తి పేరు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్. రెహమాన్ అనగానే నాగయ్యగారి త్యాగయ్య గుర్తొస్తుంది నాకు. అన్నట్టు ఈ రోజు త్యాగయ్యగారి బర్త్ డే కూడాను. అందులో త్యాగయ్య కావేరీ నదిని దాటుతోంటే పోయిన సీతారామలక్ష్మణ విగ్రహాలు కనిపించి కనుగొంటినీ […]
సాయిబాబా పడకగదిలో హత్యలు… ఇక ఎప్పటికీ తేలని ఓ మిస్టరీ…
Sai Vamshi…. … 1993లో పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరిగిన 6 హత్యల గురించి కేరళకు చెందిన హేతువాది బసవ ప్రేమానంద్ గారు రాసిన పుస్తకం ఇది. మహిమలు, స్వామీజీలకు వ్యతిరేకంగా జీవితమంతా కృషి చేసిన ప్రేమానంద్ 1974 నుంచి సత్యసాయి బాబా మీద పోరాడారు. 1986లో దాదాపు 500 మంది కార్యకర్తలతో కలిసి పుట్టపర్తిలో కవాతు నిర్వహించినందుకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అదే ఏడాది ఆయన కోర్టులో బాబా మీద కేసు వేశారు. శూన్యం […]
దిమాక్‌లో చటాక్… వోటుపై ప్రశ్నకు హీరోయిన్ జ్యోతిక బుర్ర గిరగిరా…
ఓసారి ఓ ప్రసిద్ధ మేధావిని కలిసినప్పుడు ఓ ప్రపంచ అందగత్తె … మనం పెళ్లి చేసుకుందాం, మనకు పుట్టబోయేవాడు నా అందంతో, మీ తెలివితో పుడతాడు అని అడిగిందట… ఆయన ఆశ్చర్యపోయి, ఆమెను ఎగాదిగా చూసి నవ్వుతూ… నిజమే గానీ, వాడు నీ బుద్దితో, నా అందంతో పుడితే ఎలా అన్నాట్ట… ఎప్పుడో చదివినట్టు గుర్తు ఇది… నటి జ్యోతిక ప్రెస్ మీట్ వార్త చదువుతుంటే హఠాత్తుగా ఇదెందుకు గుర్తొచ్చిందో కూడా తెలియదు… కానీ ఒక్కటి మాత్రం […]
అరెరే! సుప్రీం కోర్టు పుసుక్కున ఎంతమాట అనేసింది!
ఇప్పటి మన పెళ్లి అసలు పెళ్లే కాదా? అరెరే! భారత సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీం కోర్టు పుసుక్కున ఎంతమాట అనేసింది! ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే! అంటే… కొన్ని దశాబ్దాలుగా ట్రెండు మారిన మన భారతీయ హిందూ పెళ్లి అసలు పెళ్లే కాదా? వివాహ ఆహ్వానపత్రికలు ముద్రింపించి…మూలలకు పసుపు, కుంకుమ రాసి…మధ్యలో అక్షతలు అద్ది…ఊరూరూ తిరిగి…ఇంటింటికి వెళ్లి…బొట్టు పెట్టి…పెళ్లికి పిలిచే సంప్రదాయాన్ని వాట్సాప్ యూనివర్సిటీ మింగేసింది. వాట్సాప్ లో కాబోయే వధూవరులు పెళ్లికి ముందే తొందరపడి కూసిన…ఎగిరిన…ఒకరి […]
- « Previous Page
- 1
- …
- 39
- 40
- 41
- 42
- 43
- …
- 118
- Next Page »