‘‘అతనికి శ్మశానమే దేవాలయం : వారాంతంలో అక్కడే నివాసం : ముందే స్మారక చిహ్నం నిర్మాణం . అలా గుర్తుండి పోయిన జర్నలిజం తొలి నాళ్ళ వార్త… నాకు స్మశానమే దేవాలయం , మనిషి ఆలయానికి వెళ్ళవచ్చు , వెళ్లకపోవచ్చు కానీ అంతిమంగా శ్మశానానికి రావలసిందే అందుకే నాకు శ్మశానం అంటే ఇష్టం…’’ 41 సంవత్సరాల క్రితం బి ఆర్ లక్ష్మయ్య చెప్పిన మాటలు ఇవి . అప్పుడు నేను పదవ తరగతి పరీక్షలకు సిద్ధం అవుతున్న […]
అక్షర సూర్యుడు ఏంది..? అజరామరం ఏమిటి..? మరీ ఈ రేంజ్ కీర్తనా..?!
. THE FOUNTAIN HEAD రామోజీరావు …………………………. ప్రజల మనిషా? డబ్బు మనిషా? ……………………….. నిస్సందేహంగా రామోజీరావు ప్రజల మనిషి. నిత్యం ఈనాడు చదివినా, ఈటీవీ చూసినా, మార్గదర్శికి వెళ్ళినా, పొడులూ పచ్చళ్ళూ కొన్నా, కళాంజలిని చూసి మురిసిపోయినా, ఫిల్మ్ సిటీలో షూటింగులు చేసినా, ‘అన్నదాత’కి అభిమానులైనా, విపుల చతురలు దాచుకున్నా, ‘పాడుతా తీయగా’ అంటూ పరవశించి పాడినా…వాళ్ళంతా ప్రజలే! -ప్రజలే అతని టార్గెట్! ప్రజలే అతని పెట్టుబడి. ప్రజలే అతని సంపద. ప్రజలే అతని వ్యాపార […]
జీవిత విలువల లెక్కలకు ‘చుక్కా’ని రామయ్య సార్…!!
చుక్కా రామయ్యగారి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో? ఎంత రాయాలో? నాకు అంతుచిక్కదు. ఎంత రాసినా… ఇంకా ఎంతో రాయాల్సింది మిగిలిపోయే చుక్కాని. ప్రస్తుతం ఆయన వయసు దాదాపు వందేళ్లు. నడవలేరు. ఒకటీ అరా మాటలు మాట్లాడగలరు. వినగలరు. ఇప్పటికీ టీ వీ లో వార్తలను ఫాలో అవుతున్నారు. 1995 లో హైదరాబాద్ విద్యానగర్‌లో ఆయన పక్కవీధిలో ఉంటున్న ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు, జోతిశ్శాస్త్రవేత్త కొల్లేగళ్ ఆర్ సుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటిసారి నాకు రామయ్యసార్ […]
ఏపీ కుల రాజకీయ ముఖచిత్రం ఇదీ… రెడ్లున్నారు, కమ్మలున్నారు…
రెడ్లు వర్సెస్ కమ్మలు… ఏపీలో ఇది… తెలంగాణలో కాస్త రెడ్లు వర్సెస్ వెలమలు… పూర్తిగా కాదు, కానీ బీఆర్ఎస్ బలపడేకొద్దీ ఈ సమీకరణం బలంగా తెర మీదకు వచ్చింది… ఏపీలో అంతకుముందు పెద్దగా బహిర్గతం అయ్యేది కాదు, కానీ జగన్ పూర్తిగా కమ్మ వ్యతిరేక స్టాండ్ తీసుకుని, కమ్మ అని తెలిస్తే చాలు, తొక్కడం మొదలుపెట్టాడో ఇక పూర్తిగా ఏపీ రాజకీయం ఆ రెండు కులాల సమరంగా మారిపోయింది… నిజమెప్పుడూ నిష్ఠురంగానే ఉంటుంది… కానీ రియాలిటీ ఏమిటంటే… […]
అప్పట్లో ఈనాడుకు ఏడెనిమిది మంది ఎడిటర్లు… తర్వాత ఒక్కడే…
నాగసూరి వేణుగోపాల్ సోషల్ మీడియాలో పంచుకున్న ముచ్చట ఏమిటంటే… ‘‘దాదాపు రెండు దశాబ్దాల పాటు హైదరాబాదుకి ఏ పెద్ద జర్నలిస్టు లేదా సంపాదకుడు వచ్చినా ఈనాడు జర్నలిజం స్కూల్లో ప్రసంగించడం అనేది ఆనవాయితీ! అటువంటి మహామహులను ఈ బడ్డింగ్ జర్నలిస్టులు కలిసే అవకాశం చాలా విలువైనది. అలా లెక్చరిచ్చిన పత్రికాసంపాదకులకు పారితోషికం, వసతి వంటివి ఎలాగూ ఏర్పాటు చేయబడతాయి. ఇది ఒక పార్శ్వం కాగా, ఆ సంపాదకులు లేదా జర్నలిస్టులు, వారు ఇతర చోట్ల ఇటువంటి సదుపాయం […]
ఈనాడులో నాది ఓ చిత్రమైన కొలువు… ఓ రామోజీరావు జ్ఞాపకం…
‘ ఫస్ట్ పుట్ ద పేపర్స్ ఆన్ మై టేబుల్ ‘ 2007లో కలిసినప్పుడు రామోజీ గారు అన్న మాటలివి ………………………………………………………………………… ‘ఈనాడు’ సంస్థల్లో నేనెప్పుడూ రెగ్యులర్ ఉద్యోగిని కాదు, వారి పేరోల్స్ లో ఎన్నడూ లేను. ఇప్పుడు బతికి ఉన్నదో లేదో చెప్పడానికి వీలులేని తెలుగు డైలీ ‘వార్త’లో ఏ నెల జీతం ఏ తేదీన వస్తుందో తెలియని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న నాకు– 2003లో ఆగస్టులో ఈనాడు జర్నలిజం స్కూల్ (ఈజేఎస్)లో ‘విజిటింగ్ ఫ్యాకల్టీ’ […]
ఈనాడు దినపత్రికలో ఎప్పుడూ సాహిత్య పేజీ లేదు, ఎందుకు..?
.. ఈనాడు దినపత్రికలో సాహిత్య పేజీ ఎప్పుడూ లేదు. పెట్టరు. నేను ఈనాడుకు వెళ్లిన కొత్తలో ఆ విషయం గమనించి మా ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు గారికి ఒక లెటర్ రాశాను. ఆయన దాన్ని ఎండీ గారికి ఇస్తానన్నారు. ఆ తర్వాత ఐదేళ్లు గడిచిపోయాయి. ఆ లెటర్ సంగతి ఏమైందో తెలియదు. … కానీ ఆ తర్వాత నేను సాహిత్యమనే మహాసముద్రంలోకి దూకాక అసలు సంగతి అర్థమైంది. దినపత్రికల్లో సాహితీ చర్చల (I repeat సాహితీ చర్చలు మాత్రమే)కు […]
దహి-చీని..! మోడీకి రాష్ట్రపతి తినిపించిన ఈ తీపి వెనుకా ఓ సంప్రదాయం..!!
ఇదుగో మా ఎన్డీయే తరఫున మాకు సరిపడా ఎంపీల బలం ఉంది అంటూ ఓ జాబితా ఇవ్వడానికి రాష్ట్రపతి ముర్ము దగ్గరకు వెళ్లారు కదా మోడీ తదితరులు… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమె ఆహ్వానిస్తూనే మోడీకి ఓ స్వీట్ తినిపించింది… మీడియాలో ఆ ఫోటో ప్రముఖంగా దర్శనమిచ్చింది కూడా… ఆ తినిపించిన స్వీట్ ఏమిటి..? దహి-చీని… దైచీని… ఇదేం స్వీటబ్బా అనుకుని సర్ఫింగ్ చేస్తే అది ప్రత్యేకంగా వండబడిన స్వీటేమీ కాదని తెలిసింది… పెరుగులో కాస్త చక్కెర […]
‘‘రామోజీరావు నన్ను వెంటనే గెటౌట్ అంటారేమోనని అనుకున్నాను’’
కొంతమందితో మన స్వల్పకాల సహవాసం మన జీవితాలపై చెరగని ప్రభావాన్ని చూపిస్తాయి… దశాబ్దాలపాటు మన ఆలోచనల్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రభావితం చేస్తూనే ఉంటాయి… ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసిన రామోజీరావు కూడా నా జీవితానికి సంబంధించి అంతే… మూడున్నర దశాబ్దాలపాటు జర్నలిస్టుగా కొనసాగాను నేను, కానీ 1987 నుంచి 1989 ఈనాడు అనుబంధ ఇంగ్లిష్ పత్రిక న్యూస్టైమ్లో నా సంక్షిప్త కొలువులో లభించిన ప్రేరణే నా జర్నలిస్టు జీవితం కొనసాగింపుకు కారణం… రామోజీరావుతో నా తొలి, చివరి భేటీ […]
తనకు సరిపడకపోతే తక్షణం వదిలేసుకోగల… రియల్ ప్రాక్టికల్..!!
అతడు … అతడే. కొందరు వ్యక్తులకు మరే ఇతరులతోనూ పోలికలుండవు .. వారి పని తీరుకు కొలబద్దలుండవు .. వారి ఆశయాలకు అవధులుండవు .. ఆకాంక్షలకు హద్దులుండవు ..అదే యూనిక్ నెస్ .. నూటికో కోటికో ఒక్కరుంటారు ..నేను నేనే అని సగర్వంగా చాటి చెప్పగల .. ప్రపంచం చేత చాటింపు వేయించుకోగల సమర్థులు వీరు ..టార్చ్ బేరర్లు అందామా? చరిత్ర పురుషులు అందామా? మార్గదర్శులు అందామా? శకకర్తలు అందామా? ఏమైనా అనుకోవచ్చు .. వాళ్ల ప్రస్థానం […]
రామోజీరావు… ఆ పేరే ఓ విశేషణం… వేరే ఏ విశేషణాలు దేనికి..?
అక్షరమథనంలో పుట్టే అమృతాన్ని అస్మదీయులకు, హాలాహలం తస్మదీయులకు ఇచ్చి, తాను మంధరుడిలా మిగిలాడు… రామోజీరావుపై ఓ నెటిజన్ వ్యాఖ్య ఇది… (మంధరుడి కథ తెలిసినవాళ్లకు దీని అర్థం సరిగ్గా బోధపడుతుంది)… మరో మిత్రుడి వ్యాఖ్య మరింత ఆప్ట్… రామోజీరావు గురించి రాయడానికి ఏమేం విశేషణాలున్నాయో వెతికాను, కాసేపటికి వెలిగింది, అసలు రామోజీరావు పేరే ఓ విశేషణం కదా, కొత్తగా ఇంకేం యాడ్ చేయాలి అని… నిజమే, తన గురించి రాస్తూ పోతే పేజీలు సరిపోవు, స్పేస్ సరిపోదు… […]
ఉత్తరప్రదేశంలో కమలం ఎందుకు వాడిపోయింది..? ఒక సమీక్ష..!!
ఉత్తర ప్రదేశ్ లోకసభ ఎన్నికలు – నా సమీక్ష ! ఉత్తర ప్రదేశ్ లో ఏ పార్టీ ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలుచుకుంటుందో ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది! ఇది మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆనవాయితీగా వస్తున్నదే! 2014 , 2019 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలిచింది! 2024 లో ఎందుకు వెనకపడింది? కారణాలు అనేకం ఉన్నాయి కానీ రెండు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించాల్సి ఉంటుంది! […]
అక్కర్లేని అంశాల మీద అధిక సమయం వెచ్చించడం ఓ మానసిక సమస్య
ప్రతి మనిషీ తెలుసుకోవాల్సిన 3 విషయాలు (జగన్నాథ్ గౌడ్) 1. సర్కిల్ ఆఫ్ కంట్రోల్ (మన నియంత్రణ వలయం): మన ప్రవర్తన, మన ఆరోగ్యం, మన సంపద, మన ఉద్యోగం, మనం ఏమి చదువుతున్నాం, మనం ఏమి చూస్తున్నం, మనం ఏమి చేస్తున్నం, మన నిద్ర, మన మైండ్ సెట్ , మన బలం, మన బలహీనత, మన లోపాలు, మన అపజయం, మన విజయం మొదలగునవి (వీటి గురించి రోజులో 23 గంటల 50 నిమిషాలు […]
పైకి ఫన్నీ వన్ లైనర్స్ కొన్ని… తరచి తరచి పరిశీలిస్తే లోతెక్కువ…
డిల్బర్ట్ ఓ అమెరికన్ హ్యూమరిస్టు వన్ లైనర్స్ చాలా ఫేమస్… క్లాసిక్ కూడా… వీటిల్లో ఏది మీకు బాగా నచ్చిందో మీకు మీరే చెప్పుకొండి… కొన్ని వన్ లైనర్స్… (ఇంగ్లిషు నుంచి తెలుగులోకి అనువాదం కొంత సంక్లిష్టమే ఇవి…)(చాలావరకు మార్మికంగా ఉంటాయి… ఫన్ కాదు, డెప్త్) (అవి ఏయే సందర్భాల్లో ఎలా వర్తిస్తాయో మనకు మనం అన్వయించుకోవాల్సిందే…) 1. నేను ఆల్కహాల్‌కు నో చెప్పాను, అదేమో నా మాట వినదు 2. విడాకులకు ప్రధాన కారణమేంటో తెలుసా..? […]
ఇతరుల చీకటి కోణాల విమర్శ… బలహీనత కాదు, బలహీన సమర్థనా కాదు…
సుప్రసిద్ధ రచయిత Veerendranath Yandamoori నుంచి త్వరలో రాబోయే ఓ కొత్త పుస్తకం నుంచి ఓ పార్ట్ ఇది… తను షేర్ చేసుకున్నదే… ఇదంతా ఏ పాత్ర ఏ సందర్భంలో చెబుతుందో తెలియదు… కానీ నిజానికి దీన్ని పూర్తిగా అంగీకరించలేరు కొందరు… ముందుగా ఈ పార్ట్ యథాతథంగా చదవండి ఓసారి… బాగా లేకపోవడం వేరు, నచ్చక పోవటం వేరు..! అర్థం పర్థం లేకుండా రాళ్లు విసిరే విమర్శకులు కూడా అంతే.ఒక సెలబ్రిటీ విజయాన్ని పోజిటివ్ దృష్టితో అస్సలు చూడరు. చూడటానికి […]
ఆ చాయ్‌వాలా ప్రధాని కావొచ్చు గాక… ఈ చాయ్‌వాలా అభ్యర్థికీ ఓ రికార్డు…
ఇదుగో లోకసభకు పోటీచేసిన అభ్యర్థుల్లో అందరికన్నా ధనికుడు… టాప్ టెన్… వీళ్లపై అధికంగా కేసులున్నాయి… ఇదుగో వీళ్ల విద్యార్హతలు అంటూ రకరకాల వార్తలు వస్తుంటాయి కదా… వృత్తులతో సహా… కానీ ఎప్పుడైనా నిరుపేదల గురించి చెప్పుకున్నామా..? అసలు ఎవరైనా సరే పోటీ పడగలగడం కదా మన డెమోక్రసీ బ్యూటీనెస్… కాకపోతే గెలుస్తారా, గెలవనిస్తారా అనేది వేరే సంగతి… పార్టీల దన్ను ఉన్న నిరుపేదలు చాలామంది గెలిచారు… అవీ చెప్పుకున్నాం కూడా… మన ప్రధాని ఒకప్పుడు చాయ్‌వాలా కదా… […]
కేశవా… ఎట్టకేలకు ఆ శని సెంటిమెంట్ నుంచి విముక్తమయ్యావు…
మరీ తేలికగా తీసిపారేయలేం కదా… ఎప్పుడో ఓసారి చివరకు ఆ ఆంధ్రప్రభలోనూ హఠాత్తుగా ఓ ఇంట్రస్టింగ్ వార్త తళుక్కుమంటుంది… ఇదీ అలాంటిదే… పయ్యావుల కేశవ్‌కు ఎట్టకేలకు శాపవిముక్తి దొరికిందనేది వార్త… బాగుంది… అంటే, ఇంట్రస్టింగుగా ఉందీ అని..! అందరికీ తెలిసిందే కదా… సినిమాల్లో, రాజకీయాల్లో సెంటిమెంట్ల మంట అధికం… జ్యోతిష్కులు, మూఢనమ్మకాలు, పూజలు గట్రా అధికం… బయటికి నాస్తికుల్లా, హేతువాదుల్లా కనిపించే కొందరు లోలోపల ఏవో భయాలతో శనిజపాలు కూడా చేస్తుంటారని అంటుంటారు… సరే, దాన్నలా వదిలేస్తే… […]
టీడీపీకి ఇక మిగిలిన ఏకైక దిక్కనుకున్న జూనియర్ పేరే లేదెక్కడా…!
నిజమే… ఒక మిత్రుడు తన పోస్టులో విశ్లేషించినట్టు… జగన్ భీకరంగా దంచి కొడుతున్న దెబ్బలతో తెలుగుదేశం సతమతమవుతున్న రోజులు… అసలు ఈ పార్టీని బతకనిస్తాడా జగన్ అనుకుంటున్న కాలమది… లోకేష్ చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగించలేడనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో నిండిపోతున్న దినాలు… బాలయ్య ఒక పార్టీ పగ్గాల్ని చేపట్టి రథాన్ని నడిపించలేడు… మరెవరు ఈ పార్టీ ఉనికి కాపాడేది అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తేది… ఆ స్థితిలో ఎక్కడికి వెళ్లినా ఓ కోరిక గట్టిగానో, చిన్నగానో వినిపించేది… […]
ఎర్రజెండా… మరింత సంక్షోభంలోకి ఉనికి… కేరళలోనూ కొడిగట్టి..!!
విదేశీ భావజాలం, మద్దతు… విదేశాల కనుసన్నల్లో పార్టీల అడుగులు… ప్రత్యేకించి శత్రుదేశం ఆదేశాలకు అనుగుణంగా ఓ పార్టీ ఆలోచనలు… పడికట్టు పదాలు… వృద్ధనాయకత్వం… పట్టించుకోని కొత్తతరం… దేశీయ పరిస్థితులకు అనుగుణంగా మారని, మార్చుకోలేని అవే పాచినీటి సిద్ధాంతాలు… వెరసి లెఫ్ట్ వెలిసిపోతోంది… ఒకప్పుడు కాంగ్రెస్‌కు దీటైన ప్రత్యామ్నాయం లెఫ్ట్… తరువాత చీలికలు పేలికలై… ఇప్పుడు ఉనికి కోసం తన్లాట… కాస్తో కూస్తో త్రిపుర, బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో కనిపించేది… మమత రౌడీ దెబ్బలకు బెంగాల్ సీపీఎం కకావికలై, […]
స్టేట్ తల్నొప్పులే బోలెడు… ఢిల్లీ చక్రాలకు పెద్ద టైమ్ లేదిప్పుడు…
హఠాత్తుగా మోడీ మీద జనంలో సానుభూతి పెరిగింది… ఫాఫం, ఇక సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాల్సి ఉంటుందని కాదు… చంద్రబాబు మీద, నితిశ్ మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడిపించే పరిస్థితిలో ఇరుక్కున్నందుకు..! మీరు ఎప్పుడొచ్చినా సరే, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, మీకేం కావాలో అడగండి అని ఇండి కూటమి నుంచి ఖాళీ చెక్కు అందిందట… ఇంకేముంది..? అసలే చంద్రబాబు… చక్రాలు తిప్పే అలవాటు… పైగా లోలోపల మోడీ మీద ఎన్నాళ్లుగానో అణుచుకున్న కోపం… ఎప్పుడు ఎన్డీయే కాడి కింద […]
- « Previous Page
- 1
- …
- 40
- 41
- 42
- 43
- 44
- …
- 125
- Next Page »