Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మంత్రి సీతక్క ఝలక్… బీఆర్ఎస్ దుష్ప్రచారంపై కోర్టు అక్షింతలు…

May 7, 2026 by M S R

.

అబద్దాలు, వక్రబాష్యాలు, అడ్డదిడ్డం విమర్శలతో… టన్నుల కొద్దీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బురద జల్లడానికి బీఆర్ఎస్ క్యాంపు పెడుతున్న ఖర్చు అంతా ఇంతా కాదు… కోట్లకుకోట్లు… అనేక యూట్యూబ్ చానెళ్లు, వెబ్‌సైట్లు, వందల సోషల్ మీడియా ఖాతాలు… ఈ స్థాయి నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్న పార్టీ దేశంలో మరొకటి లేదు…

దాన్ని నిలువరించడం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేతకావడం లేదు… కనీసం విమర్శలకు సరైన, పవర్ ఫుల్ కౌంటర్లు కూడా లేవు… ఈ స్థితిలో మంత్రి సీతక్క ఓ మార్గం చూపించింది… విషయం ఏమిటంటే..? అంగన్‌వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల మీద బీఆర్ఎస్ క్యాంపు, అన్ని విషయాల్లోలాగే ఏవేవో విమర్శలకు దిగింది… తన సోషల్ మీడియాలో ఎడాపెడా పోస్టులు కుమ్మేసింది…

Ads

మంత్రి సీతక్క వివరణ ఇచ్చినా పట్టించుకోలేదు… దీంతో ఆమె ఏకంగా కేసీయార్‌ను బాధ్యుడిని చేస్తూ లీగల్ నోటీసులు పంపించింది… అదీ క్రిమినల్ నేచర్ ఉన్న డిఫమేషన్ కేసు వేస్తానని..! బీఆర్ఎస్ అధినేత కేసీయారే కాబట్టి తనే ఈ నిర్వాకానికి తనే బాధ్యుడనేది ఆమె వాదన… ఐనా బీఆర్ఎస్ తమ పోస్టులు ఆపలేదు… చివరకు ఫలితం ఏమిటంటే..? ఈ సోషల్ మీడియా నెగెటివ్ క్యాంపెయిన్లకు సంబంధించి కేసీయార్‌కు శృంగభంగం…

మిగతా మంత్రులకు ఏమైనా లెసన్ నేర్పించినట్టేనా సీతక్క..? సరే, ఈ కేసులో ఏం జరిగిందీ అంటే..? బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంపై కోర్టు మొట్టికాయలు… తక్షణమే ఆ సోష‌ల్ మీడియా పోస్టులు తొలగించాలని ఆదేశించింది హైద‌రాబాద్ సిటీ సివిల్ కోర్ట్… ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు…

మొబైల్ ఫోన్ల కొనుగోళ్ల టెండర్ డాక్యుమెంట్స్ పరిశీలించిన కోర్టు, రూ. 30 కోట్లు అవినీతి అనే బీఆర్ఎస్ ఆరోపణ‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని తేల్చింది… టెండర్ నోటిఫికేషన్ నుండి చెక్ పేమెంట్ వరకు వివరాలు పరిశీలించింది కోర్టు…

మొబైల్ ఫోన్లు ఒక్కోటి రూ. 11,650/- చొప్పున కొనుగోలు చేయగా… రూ 8,499 విలువైన ఫోన్ రూ 14,499 చొప్పున కొన్నారని బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా నిర్ధారించింది కోర్టు…  సదరు ఆరోపణలు పిటిషినర్ సీతక్క ప్రతిష్ఠను దెబ్బతీయడానికే అన్న వాదనతో ఏకీభవించింది… ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ల నుండి ఏప్రిల్ 10 న చేసిన పోస్టులన్నీ తొలగించాలని ఆదేశం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?
  • ఏదో ఒకటి గోక్కోవడం అనసూయకు అలవాటే కదా… ఇదీ అదే..!!
  • కేసీయార్ క్షుద్ర జర్నలిజం! అసలు నీరో ఎవరు పెద్ద దొరవారూ!?
  • సర్సర్లే గానీ పాయల్… ఆ కంటెంట్ లేకపోతే సబ్‌స్క్రిప్షన్లు వస్తాయంటావా!?
  • బీఆర్ఎస్ నిధులపై కవిత పేల్చిన పొలిటికల్ కరప్షన్ బాంబు!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions