సిరి హన్మంతు… ఈ బుల్లితెర నటికి కొత్తగా జబర్దస్త్ యాంకర్ పాత్రలోకి దూరిపోవడానికి ఒక అడ్వాంటేజ్ ఉంది… అది తనకు తెలుగు బాగా వచ్చు… తెలుగు అమ్మాయే… సో, రష్మిలా తత్తరతత్తర తెలుగు బాధ పడనక్కర్లేదు… మొన్నమొన్నటిదాకా యాంకర్‌గా పనిచేసిన సౌమ్యారావు కన్నడ మిక్స్ తెలుగు కూడా అక్కర్లేదు… అఫ్ కోర్స్, అనసూయ వంటి టింగ్లిషు కూడా ఏమీ వద్దు…
అఫ్కోర్స్, అందంగా ఉండటం, దిక్కుమాలిన ఏ స్కిట్, ఏ జోక్ అయినా సరే, నవ్వు పులుముకోవడం… అప్పుడప్పుడూ పడీపడీ నవ్వడం… ఎవరి స్కిట్ ఇప్పుడు చూడాలో చెప్పడం… స్పాన్సరర్ల జాబితా చదవడం… ఇంతేకదా జబర్దస్త్ యాంకర్ల పని… ఓసోస్, ఆమాత్రం చేయలేదా ఏమిటి..? కాకపోతే ఆ హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్‌ల వెకిలి ‘ర్యాగింగ్’ను తట్టుకోవాలి… సౌమ్యారావు బాగా ఇబ్బందిపడింది… ఆమె జబర్దస్త్ వీడిపోవడానికి తన వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా..? లేక ఇదే కారణమా తెలియదు…
సిరి హన్మంతు బిగ్‌బాస్‌కు రావడానికి ముందే టీవీ ప్రేక్షకులకు తెలుసు… ఒకటీ అరా టీవీ సీరియళ్లలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఏదో పాత్ర పోషించినట్టు గుర్తు… బిగ్‌బాస్ వచ్చాక అక్కడ ఆట తీరుతో గాకుండా షణ్ముఖ్‌తో ఓ హాట్ ప్రేమాయణం నడిపి ఫేమస్ అయ్యింది… బయట ఆల్రెడీ లవర్ శ్రీహాన్ ఉన్నా సరే, హౌజులో షన్నూతో లవ్వు, రొమాన్స్ ఆమె పట్ల వ్యతిరేక భావనకు దారితీశాయి… ఒకే దుప్పట్లో, ఒకే మంచం మీద ఇద్దరూ పడుకోవడం వంటి వెగటు పోకడలు సరేసరి…
Ads
సో, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వంటి సీనియర్ కమెడియన్ల ర్యాగింగ్ తట్టుకుంటుందేమో చూడాలి… ఇంద్రజ సపోర్ట్ ఉన్నా వేస్ట్… సౌమ్యారావు అనుభవించిందిగా… మల్లెమాల ప్రొడక్షన్స్‌లో డైరెక్టర్లు కూడా ఈ సీనియర్ కమెడియన్ల గుప్పిట్లో కేరక్టర్లే… నిజానికి టీవీల్లో బోలెడు యాంకర్లు… జబర్దస్త్ యాంకర్ అంటే ఓ క్రేజ్ మాత్రం ప్రేక్షకుల్లో ఉంది… అది నిజం…
రష్మిని నిలబెట్టింది, కూడు పెట్టేది జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలే… అనసూయను ఏళ్ల కొద్దీ పోషించింది జబర్దస్త్… మార్కెట్లో సుమ టాప్ యాంకర్, నంబర్ వన్ కాదు, అంతకు ఎక్కువ… ఆమెతోపాటు యాంకర్‌గా స్టార్ట్ చేసిన ఉదయభాను వంటి సీనియర్లు ఫేడవుట్ అయిపోయినా సరే సుమ సినిమా కార్యక్రమాల హోస్ట్‌గా, టీవీ షోల యాంకర్‌గా ఓ పాపులర్ సినిమా తారకు దీటుగా సంపాదిస్తోంది, అలరిస్తోంది… ఆమె తప్ప మిగతా యాంకర్లు వస్తుంటారు, పోతుంటారు… ఎవరూ పెద్ద ఇంప్రెసివ్‌గా నిలదొక్కుకోలేదు…
సో, సిరి హన్మంతు నిలదొక్కుకుంటుందా లేదానేది వేచి చూడాలి… ప్రోమో చూస్తే జస్ట్, అప్పుడప్పుడూ నవ్వుతూ కనిపించింది… అంతేలే… జబర్దస్త్ యాంకర్లకు అంతకుమించి పనేముంటుంది..? నవ్వమ్మా, నవ్వు… అదొక్కటీ చాలు… నాలుగు డబ్బులు, ఫేమ్ సంపాదించి పెడుతుంది… కాకపోతే ప్రస్తుతం జబర్దస్త్ వాతావరణం కలుషితమై ఉంది, కాస్త ముదురువే, ఐనా సరే, బహుపరాక్… అనసూయ, సుడిగాలి సుధీర్, గెటప్ సీను వంటి వాళ్లే పారిపోయారు… జాగ్రత్త…!!
Share this Article