. అనామకంగా… ఓ సాదాసీదా అపార్ట్‌మెంట్… ఒక్కడే బతుకుతూ ఉండేవాడు… నియమబద్ధ జీవితం… మధ్యతరగతి జీవనం… ఎవరి మీదా ఆధారపడి బతకడం ఇష్టం లేదు… ఓనర్ తరచూ విసుక్కునేవాడు… అద్దె సరిగ్గా కట్టడం లేదంటూ నిందించేవాడు… ఇల్లు ఖాళీ చేసి, వెళ్లిపో అని అరిచేవాడు… ఆయన మౌనంగా భరించేవాడు, మీ అద్దె అణా పైసలతో సహా చెల్లిస్తాను అని చేతులెత్తి ఓ దండం పెట్టేవాడు… డబ్బు ఎక్కడ ఎలా కాస్త అడ్జస్టయినా ముందుగా అద్దె కట్టేవాడు… ఐనా […]
ఈమె ఎవరు..? హిమాలయాలకు ఏం లాక్కొచ్చింది..? ఏం కట్టిపడేసింది..?
. అదుగో ఆ ఆశ్రమంలో స్వామి రేపిస్ట్… ఇదుగో ఈ ఆశ్రమంలో అంతా వ్యభిచారం… కబ్జాలు, వసూళ్లు, పాదపూజలు, కుట్రలు… అన్నీ అక్రమాలే… కేసుల నమోదు… అరెస్టు… బెయిల్ నిరాకరణ… ఎన్ని వార్తలు చదివాం, చదువుతూనే ఉన్నాం..? అసలు ఒక ఆశ్రమం అనగానే ఓ నెగెటివిటీ ధ్వనించేంతగా మీడియా ప్రసారం… ప్రచారం… పోలీసు కేసులు… వాటికితోడు రాజకీయ నాయకులతో అక్రమ బంధాలున్న కార్పొరేట్ సన్యాసులు సరేసరి… నిజానికి కొన్ని వేల ఆశ్రమాలున్నయ్ ఈ దేశంలో… హిమాలయ ప్రాంతాల్లో […]
ఆ ముగ్గురూ… ఒకే ఊరు, ఒకే బడి, ఒకే తరగతి, ఒకే కులం… కానీ దారులు..?!
. ముందుగా ఓ కథ చదవండి… 2017 నుంచి రకరకాల సైట్లలో, సోషల్ మీడియా గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేటయింది… ఇప్పటికీ షేర్ అవుతూనే ఉంటుంది… డెస్టినీ అంటే ఎలా ఉంటుందో చెప్పడానికి దీన్ని ఉదహరిస్తుంటారు… చదువు, సంపద, హోదా, వారసత్వం, సపోర్ట్ ఏమున్నా సరే, పిసరంత అదృష్టం, కర్మఫలం బాగుంటే విజయం వెంట ఉంటుందని చెప్పడానికి ఈ కథను వివరిస్తుంటారు… ఆ కథేమిటంటే..? ఒక పిల్లవాడు… బ్రిలియంట్… బడిలో ఎప్పుడూ ఫస్ట్ క్లాస్… ప్రతి పరీక్షలో టాపర్… […]
గ్రేట్ ఫాదర్..! కొడుకు కోసం నమ్మలేని అద్భుతం సాధించిన తండ్రి ప్రేమ..!!
. కొన్ని అద్భుతాలు అంతే..! ఆ అద్భుతాల వెనుక అంతులేని మానవప్రేమ… గాఢమైన అనుబంధం… సాహసం…! యాదృచ్ఛికమో, దైవసంకల్పమో, మానవప్రయాసో, కాకతాళీయమో… కొన్ని నమ్మలేని అద్భుతాలు వినిపిస్తయ్, కనిపిస్తయ్, నిబిడాశ్చర్యంలో ముంచేస్తయ్… ఇదీ అంతే… అప్పట్లో చాలా ఏళ్ల క్రితం తెలుగులో పాపులర్ నవల పాఠకుల్ని ఉర్రూతలూగిస్తున్న కాలం అది… యండమూరి వీరేంద్రనాథ్ ఓ వీక్లీలో ప్రార్థన అనే సీరియల్ రాస్తుండేవాడు… (ఏదో ఇంగ్లిష్ నవల నుంచి ఆ ప్రార్థన నవల ఇతివృత్తం తీసుకున్నట్టు రచయిత కూడా […]
ఇజ్రాయిల్ అంటే అంతే..! నో కాంప్రమైజ్..! ఈ థ్రిల్లర్ ఓసారి చదవండి..!
. ముందుగా వాట్సప్ గ్రూపుల్లో బాగా సంచరిస్తున్న ఒక పోస్టులోని ఒక భాగాన్ని తీసుకుందాం… అది ఇజ్రాయిల్‌కు అనుకూలంగా బీజేపీ సోషల్ బ్యాచ్ పుష్ చేస్తున్న పోస్ట్… బాగానే వైరల్ అవుతోంది… అయితే ఆ మొత్తం పోస్టు గాకుండా… అందులో ఒక స్టోరీని తీసుకుందాం… ఇజ్రాయిల్ ధోరణి స్థూలంగా ఎలా ఉంటుందో ఈ కథ మనకు చెబుతుంది… ఈ కథ పేరు ‘ఆపరేషన్ థండర్ బోల్ట్’… అయితే ఈ వైరల్ కథలో లేని కొన్ని ఫినిషింగ్ టచెస్ […]
అర్ధరాత్రి… ఆ రద్దీ బోగీలో ఓ రోగి విలవిల… ఎదుటి బెర్తులో ఓ పెద్దాయన…
. నేను చెన్నైలో పనిచేస్తూ ఉండేవాడిని… నా పూర్వీకుల ఇల్లు భోపాల్‌లో… నాన్న అక్కడే ఉండేవాడు… హఠాత్తుగా ఓరోజు పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి నాన్న కాల్ చేసి, వెంటనే ఇంటికిరా అన్నాడు… నాకిక్కడ అర్జెంటు పని ఉంది అని చెప్పేలోపు కట్ చేశాడు… అప్పటికప్పుడు బ్యాగు సర్దుకుని రైల్వే స్టేషన్ చేరుకున్నాను… బుకింగ్ లేదు, రిజర్వేషన్ లేదు… వేసవి సెలవులు కదా, ఏ రైలు చూసినా ఫుల్లు రద్దీ… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్ మీద […]
మొగుడు తొమ్మిదేళ్లు పెద్ద… పైగా టీబీ… నాలుగో పెళ్లాం… చదవాల్సిన లైఫ్…
ఉమ… ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో… కోయంబత్తూరు… తండ్రి బాలకృష్ణన్, తల్లి తంకమణి… తండ్రి తన యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఎంబీబీఎస్ ఒక సంవత్సరం చదివి, వదిలేసి, వద్దులే అని తండ్రి చెప్పగానే తిరిగి వచ్చేశాడు… ఓ డాక్టర్ దగ్గర కంపౌండర్‌గా కూడా చేరాడు… అప్పట్లో అల్లోపతిని ఎవరూ పట్టించుకునేవారు కాదు… సైకిల్ మీద డాక్టర్, కంపౌండర్ ఊరంతా తిరిగేవారు రోగుల కోసం… ఇది జరిగే పని కాదని ఏదో మిల్లులో చేరాడు… అక్కడ రిసెప్షనిస్టుగా చేరిన తంకమణిని పెళ్లిచేసుకున్నాడు… బిడ్డ […]
ధన్యజీవి..! అత్యంత అరుదైన రక్తంతో లక్షల శిశువులకు ప్రాణదానం..!
. నిన్న ఇంగ్లిషు మీడియాలో కనిపించిన ఈ వార్త ఆసక్తికరంగా ఉంది… “గోల్డెన్ ఆర్మ్ మ్యాన్” గా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియన్ రక్తదాత జేమ్స్ హారిసన్ 88 సంవత్సరాల వయస్సులో కన్నుమూశాడు… ఫిబ్రవరి 17న NSW సెంట్రల్ కోస్ట్, ఆస్ట్రేలియాలోని పెనిన్సులా విలేజ్ నర్సింగ్ హోమ్‌లో ఆయన మరణించినట్టు ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ లైఫ్ బ్లడ్ ధృవీకరించింది…. ఇదీ వార్త… అసలు ఎవరాయన..? ఎందుకు తన గురించి చెప్పుకోవాలి…? ఇదీ అసలు ప్రశ్న… సింపుల్‌గా చెప్పాలంటే ఈయన అరుదైన […]
దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…
. 1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది… అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్… ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి… జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు… ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు… ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు […]
Take A Bow… ఎంత మంచివాడవురా… ఎన్ని నోళ్ల పొగుడుదురా…
. ( రమణ కొంటికర్ల )… మనం చూసిన అతి పెద్ద విపత్తుల్లో కరోనా ఒకటైతే.. సునామీ మరొకటి. అలాంటి సునామీ నుంచి బతికి బట్టకట్టిన ఓ అమ్మాయికి.. నాటి సునామీ సమయంలో ఎందర్నో మృత్యుఒడి నుంచి తప్పించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇటీవలే పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగేవరకూ ఆ ఐఏఎస్ అధికారి దంపతులే ఆ అమ్మాయికి గాడ్ ఫాదర్, మదర్ గా నిల్చారు. ఆ కథ వినాలంటే ఓసారి నాగపట్నంలో నాటి సునామీ కాలం 2004కు […]
మహిళా స్పూర్తి..! సముద్రపు ఆ అంచు టచ్ చేసిన నేవీ కమాండర్స్..!
. ( రమణ కొంటికర్ల ) .. ….. సంద్రపు చివరి అంచును చుట్టివచ్చిన సాహస వనితలు.. ఆ కమాండర్స్! . ఇద్దరు భారత నేవీ మహిళా అధికారులు అద్భుతమైన ఫీట్ సాధించారు. భూమిపైనే చివరి ప్రాంతమైన మిస్టీరియస్ ఏరియా.. పాయింట్ నెమోను చుట్టిరావడమే వారు సాధించిన ఘనత. సముద్రంలో చివరి సరిహద్దు వరకు వెళ్లడమే తప్ప.. ఆ సరిహద్దు ఆవలికి వెళ్లి ఆ అంచుల్లోని మారుమూల ప్రాంతాలను చుట్టిరావడం పూర్తిగా సాహసోపేతమైన, ఓపికతో కూడిన […]
ఆ క్షణం, ఉరికి వేలాడేదే… ఒక ఆలోచనకి, కొత్త బతుక్కి మదిలో పురుడు…
. పోటీ పరీక్షల్లో ఎలా చదివారు..,? సివిల్స్ ఎలా బ్రేక్ చేశారు..? ఏ బ్యాచ్, ఏ ర్యాంక్, ఎన్ని మార్కులు, ఏ సబ్జెక్టు, ఎన్నిసార్లు దండయాత్ర, రోజుకు ఎన్ని గంటలు చదివారు..? మంచి ర్యాంకులు సంపాదించిన సివిల్స్ క్రాకర్స్ సక్సెస్ స్టోరీలు బోలెడు చదువుతుంటాం… వాటిల్లో కొన్ని మాత్రమే పేద, గ్రామీణ, అణగారిన సామాజికవర్గాల నేపథ్యం నుంచి వచ్చిన కథలుంటాయి… అవి స్పూర్తిదాయకమే… చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో మరో భిన్నమైన సక్సెస్ స్టోరీ కనిపిస్తోంది… సరే, సోషల్ […]
తత్వబోధ..! ఆమె ఓ సాదాసీదా సేల్స్ గరల్ కాదని ఆలస్యంగా అర్థమైంది..!!
చెన్నై… మైలాపూర్… కాపాలీశ్వర కోవెలలో దర్శనం అయిపోయింది… గిరి ట్రేడింగ్ స్టోర్స్‌లోకి వెళ్లి ‘తత్వబోధ’ పుస్తకం కోసం వెతుకుతున్నాను… అక్కడ బోలెడన్ని పుస్తకాలు… అనేక సీడీలు… అభంగ్ నుంచి అరుణా సాయిరాం దాకా… భజనల నుంచి బాంబే జయశ్రీ దాకా… బొచ్చెడు సీడీలు… ఓహ్, సరైన ప్లేసులోకే వచ్చాం అనిపించింది… నా భార్య భారతీయర్ పాటల సీడీల కోసం వెతుక్కుంటోంది… నేనేమో ఆ పుస్తకాల దొంతర్లలో ఆ తత్వబోధ అనే పుస్తకం కోసం అన్వేషిస్తున్నాను… దొరకడం లేదు… […]
ఆ రుషి వెనుక ఓ రాజు… ఆ అడుగులు వేయించింది ఆ దోస్తీ, ఆ ఔదార్యమే…
(….. By…. Ramana Kontikarla….) స్వామి వివేకానంద పేరు వినగానే భారతీయులకు మొట్టమొదట స్ఫురించేది ఆయన షికాగో పర్యటన. మతతత్వం, మతోన్మాదం, దాన్నుంచి పుట్టుకొచ్చిన భయంకరమైన వారసత్వమే లేకుంటే… ఈ పుడమి ఇంకా మరెంతో అందంగా ఉండేదని… కానీ హింసతో రక్తసిక్తమైన భూమిగా మార్చి.. నాగరికతను ధ్వంసం చేసిన వైనాన్ని… అలా జరిగి ఉండకపోతే ఈ ప్రపంచం ఇంకా ఎలా అభివృద్ధి చెంది ఉండేదనే అంశాన్ని 1893 సెప్టెంబర్ 11న నరేంద్రుడు షికాగో లోని ఆర్ట్ ఇనిస్టిట్యూట్ […]
హైఫై అండ్ క్లీన్ విలేజ్… అన్ని ఊళ్లూ ఇలా మారితే..? ఆహా…!
. . ( రమణ కొంటికర్ల ) .. ….. పట్టణాలెన్నటికీ భారతదేశ ముఖచిత్రం కావు… గ్రామాలే భారతదేశ నాడీవ్యవస్థ అంటాడు మహాత్ముడు. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం 70 శాతం గ్రామీణ భారతంలో నివశిస్తున్నవారిలో చాలామంది పట్టణాలకు వలసలబాట పడుతున్నారు. దాంతో ఇటు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. పట్టణాలు జనాభాతో నిండిపోతున్నాయి. రెండింటికి రెండూ ఆందోళనకరంగా మారాయి. పట్టణ మౌలిక సదుపాయల కల్పనకూ ఈ వలసల ప్రక్రియ అంతరాయంగా మారిపోతోంది. చిల్లికుండలో నీళ్లు […]
ప్రతాప్ చంద్ర సారంగి..? ఈ ఒడిశా మోడీ ఓ ఇంట్రస్టింగ్ కేరక్టర్..!!
. రాహుల్ గాంధీ కావాలని నెట్టేశాడు, అందుకే 69 ఏళ్ల ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి కింద కూలబడి గాయాలయ్యాయి, హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందని బీజేపీ ఆరోపణ… అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, తరువాత ఆ సెక్షన్ తీసేసినట్టు ఓ వార్త… నాగాలాండ్ తొలి మహిళా రాజ్యసభ సభ్యురాలు, వైస్ చైర్మన్ కోనియాక్ తన పట్ల రాహుల్ గాంధీ ప్రవర్తన సవ్యంగాి లేదు, సభ్యంగా లేదు అని ఆరోపించింది… మొత్తానికి ఈ వివాదాలు, కేసులు, విమర్శలతో రాజ్యసభ […]
చదరంగపు ఎత్తులను మించి… ఎత్తుగా నిలిచిన తండ్రి తపన…
. అమ్మా నాన్న ఒక గుకేష్ అరవై నాలుగు తెలుపు నలుపు గళ్ళ పలక అతడికి యుద్ధరంగం. అతడే రాజు. అతడే మంత్రి. అతడే సర్వసైన్యాధ్యక్షుడు. అతడే కాల్బలం. అతడు ఏనుగును లొంగదీసుకుని నడిపిన మావటి. అతడు గుర్రాన్ని అధిరోహించి పరుగులు పెట్టించిన ఆశ్వికుడు. అతడు ఎడారిలో ఒంటె మీద ఒంటరి ప్రయాణం చేసిన యోధుడు. అతడిప్పుడు చదరంగ రథగజతురగ పదాతిసమావృత పరిజన మండిత లోకనుతుడు. ఒక్కొక్క ఎత్తులో ప్రత్యర్థిని చిత్తు చేసి ప్రపంచ చదరంగ రారాజుగా […]
ఆకాశంలోకి చూశాను… అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మా నాన్న…
. Prabhakar Jaini… రాత్రి 11 గంటలకు తాళం వేసి ఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు, చేతిలో చిన్న సంచితో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ, “ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ?” అని అడిగారు. “అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. […]
వయసు పద్దెనిమిది… యంగెస్ట్ కమర్షియల్ పైలట్… విజయగాథ…
. బీజాపూర్ సిద్ధేశ్వర ఉత్సవాల కోసం.. కర్నాటకలోని విజయపుర జిల్లా అధికార యంత్రాంగం.. జిల్లా కేంద్రం విజయపుర నుంచి బీజాపూర్ వరకు హెలికాప్టర్ రైడ్స్ ఏర్పాటు చేసింది. తల్లిదండ్రులతో సహా, ఆ హెలికాప్టర్ ఎక్కింది సమైరా హుల్లూర్. హెలికాప్టర్ నడిపే పైలట్ ఆటిట్యూడ్, స్టైల్ ఆమెను ఆకట్టుకున్నాయి. ఇక ఆ పిల్ల ప్రశ్నల వర్షం కురిపించింది. అందుకు ఆ పైలట్ కూడా అంతే సావధానంగా తన పని తాను చేస్తూనే మరింత ముచ్చటగా సమాధానాలు చెబుతున్నాడు. ఆ […]
యవ్వనంలోనే సన్యాసం… ఆసక్తి గొలిపే వైరాగ్య ధోరణులు…
. ఈరోజు ఆసక్తికరం అనిపించిన వార్త… మలేసియాలోకెల్లా మూడో అతిపెద్ద ధనవంతుడి కొడుకు… సర్వం విడిచి సన్యాసం స్వీకరించడం… అంత వైరాగ్య భావన ఎలా సాధ్యపడిందో మరి… , ముందుగా ఈ వార్త చదవండి… (నిజానికి పాత వార్తే)… తన పేరు వెన్ అజాన్ సిరిపన్నో… మలేషియాకు చెందిన బిలియనీర్ ఆనంద్ కృష్ణన్‌కు ఈయన ఏకైక సంతానం… తండ్రికి దాదాపు 40 వేల కోట్ల ఆస్తులున్నాయి… మనం చాలామంది ధనికుల పిల్లల్ని చూస్తుంటాం కదా… అధికారం, డబ్బు, […]
- « Previous Page
- 1
- 2
- 3
- 4
- …
- 9
- Next Page »