కెమెరాలకు ఇలా ఫోజు ఇస్తుంటే భలే ఉంది… నా బైక్, నవ్వారి చీరెలో దాని పక్కన నేను… చుట్టూ పెద్ద గుంపు… వాళ్లు ‘భారత్ కే బేటీ’ అంటుంటే నిజంగానే అలా ఫీలయ్యాను… అసలు ఇదంతా 2022 ఇండిపెండెన్స్ డే నాడు నరేంద్ర మోడీ చేసిన ప్రసంగంతో స్టార్టయింది… గ్రామీణ వృత్తికళాకారులకు ప్రోత్సాహం, మహిళా సాధికారత మీద మాట్లాడాడు ఆయన… తన మాటలు నాకు కనెక్టయ్యాయి… ఓ సాహసయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన తళుక్కుమంది… చేయగలనా..? […]
ఈ ఫోటోకు పులిట్జర్ ప్రయిజ్ వచ్చింది… ఈ సంఘటన ఏమిటో తెలుసా..?!
మృత్యువు ముద్దు (Kiss of Death) అని ఏదో ఇంగ్లిష్ పోస్టులో కనిపించింది… కానీ మనం మృత్యుపరిష్వంగం లేదా మృత్యుస్పర్శ అందాం… ఇంకా ఆయుష్షు ఉంటే సుడిగుండంలో పడినా నిక్షేపంగా బయటపడతాడని కదా పెద్దలు చెప్పేది… నాకు ఈ కథ విన్నాక అదే వినిపించింది… నొసటి మీద ఆయుష్షు రాసి పెట్టి ఉంటే, యముడి పాశం కూడా పొగలు రేగుతూ వచ్చినా సరే, చివరకు వాపస్ వెళ్లిపోతుంది… నిజం… భూమ్మీద నూకలు బాకీ ఉండాలి… 1968… రోకో […]
భారత జాతి సంస్మరించాల్సిన ఓ జపానీ యువతి… చదవాల్సిన చరిత్ర…
పదే పదే మనం మన చరిత్ర పుస్తకాల్లో కొందరి స్వాతంత్ర్య సమరయోధుల కథలే చదువుతున్నాం… కానీ తమ ప్రాణాలకు తెగించి, విదేశాల్లో ప్రవాసంలో ఉంటూ దేశమాత సేవలో పునీతులైన ఎందరి కథల్నో మన చరిత్ర పుస్తకాలు మనకు చెప్పడం లేదు… అంతేకాదు, మనవాళ్లను పెళ్లి చేసుకుని, తమ జీవితాల్ని భరతమాత పాదాల వద్ద అర్పించిన విదేశీయుల కథలూ ఉన్నయ్… కానీ ఇన్నేళ్లూ వాటిని మన పిల్లలకు చెప్పినవాడెవ్వడు..? టోసికో… ఈమె కథ ఖచ్చితంగా చదవదగ్గది… భర్త పేరు […]
మాటిమాటికీ ఏడుపొచ్చేది… అప్పటికి నాకు పెళ్లంటే ఏం తెలుసు గనుక…
పద్నాలుగేళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది… నిజాయితీగా చెబుతున్నాను… అప్పటికి పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియదు నాకు… మాటిమాటికీ ఏడుపొచ్చేది పెళ్లయ్యాక… ఎందుకంటే..? అమ్మానాన్నతో దూరంగా ఉండాల్సి రావడం… చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఇది సహజమే కదా… నా భర్తతో కూడా చనువుగా, ఎక్కువగా మాట్లాడకపోయేదాన్ని… ఇంట్లో పని ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని… అందులో నన్ను నేను బిజీగా ఉంచుకునేదాన్ని… నా భర్తకు అర్థమైనట్టుంది ఎవరికైనా చదువు ఎంత ముఖ్యమో… […]
పేరులోనే గుడ్ఇయర్… బతుకంతా అప్పులు, అనారోగ్యం… ప్రాణం తీసిన ప్రయోగాలు…
చార్లెస్ గుడ్ ఇయర్… తన పన్నెండో ఏట బడి మానేశాడు… కనెక్టికట్‌లో ఉండే తన తండ్రి హార్డ్‌వేర్ స్టోర్స్‌లో పనిచేయడం కోసం… 23వ ఏట క్లారిసా బీచర్ను పెళ్లి చేసుకున్నాడు… ఓ కొడుకు పుట్టాడు… ఫిలడెల్ఫియాలో మరో హార్డ్‌వేర్ స్టోర్స్ సొంతంగా తెరిచాడు… గుడ్ ఇయర్ మంచి సమర్థుడైన వ్యాపారే… కానీ తనకు కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ కొత్త ఆవిష్కరణల మీద ఆసక్తి అధికం… 1820 ప్రాంతంలో తను నేచురల్ రబ్బర్ (ఇండియన్ రబ్బర్) మీద బాగా […]
ఎవరు ఈ క్షమా సావంత్..? ఎందుకు ఈమెను మెచ్చుకుని చప్పట్లు కొట్టాలి..?!
Nancharaiah Merugumala………. అమెరికా సిటీ సియాటల్ లో చరిత్ర సృష్టించిన తమిళ బ్రాహ్మణ పోరాటయోధురాలు క్షమా సావంత్… పుణెలోని సొంత ఇంట్లో 44 ఏళ్ల నాటి కుల వివక్షను మరవని గొప్ప మహిళ! … ఈ వాయువ్య అమెరికా నగరంలో ఇక ముందు ప్రకటిత కులద్వేషం నేరమే! ………………………………………………………………… కుల వివక్షకు, కులతత్వానికి పేరుమోసిన తమిళ బ్రాహ్మణ సమాజంలోని ఓ కుటుంబంలో పుట్టిన క్షమా సావంత్ నేడు అమెరికాలో సాంఘిక విప్లవానికి నిలువెత్తు స్తంభంగా నిలబడింది. వాయువ్య […]
శాములూ… నీ కాళ్లు మొక్కినా తప్పులేదు… మొగుడంటే నువ్వే భాయ్…
ఖాకీల కారుణ్యం !! *** భార్య శవాన్ని మోసుకెళ్తున్న అభాగ్యుడికి సాయం *** పోలీసులంటే కాఠిన్యం అనే అందరూ అనుకునేది.. కొన్ని కరకు ఖాకీ దుస్తుల వెనుక చల్లని మనసుంటుందని నిరూపితమైన ఘటన ఇది. . నిరుపేదలు దేశంలో చచ్చిన తరువాత కూడా వారికి కాటికి చేరడం కూడా కష్టమే అనే మరో జీవన సత్యాన్ని సైతం ఆవిష్కృతమైన సంఘటన ఇది. మార్గమధ్యంలోనే భార్య కన్నుమూస్తే ఆమె శవాన్ని 130 కిలోమీటర్లు మోసుకుని వెళ్లేందుకు సిద్ధమైన ఓ […]
నీళ్ళు లేని ఎడారిలో… కన్నీళ్లయినా తాగి బతకాలి…
Be Patient: పత్రికల్లో ఆత్మహత్యల వార్తలు లేని రోజంటూ ఉందా..? ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. చదువు భారం పెరిగి, ఆశించిన మార్కులు రాక ఒక విద్యార్థి; బదిలీ దూరం భార్యాభర్తల మధ్య బహుదూరమై ఒకరు; పొలం అప్పు తీర్చలేక ఒకరు; కొడుకు బుద్ధి మాంద్యాన్ని భరించలేక ఒకరు; మాజీ ప్రియుడి వేధింపులు భరించలేక ఒకరు… ఇంకా ఎందరో పోయారు. జీవితం అంటే గెలుపు; జీవితమంటే సుఖం; జీవితమంటే శిఖరారోహణం…అని మన నరనరాన ఎక్కించుకున్నాం. జీవితమంటే ఎడతెగని ప్రయాణం. […]
Vani Jayaram… వాణి అంటే పలుకు, చదువు.., ఈ గాన సరస్వతి కూడా…
Vani Jayaram : తమిళనాడులో పుట్టి దక్షిణాది అన్ని భాషల్లో ఇరవై వేలకు పైగా పాటలు పాడిన వాణీజయరాం గురించి చెప్పుకోవాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది. ఆమెకు పద్మభూషణ్ అవార్డు రావడంతో… ఆమె ఏయే భాషల్లో ఎన్ని పాటలు పాడారు? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారు? లాంటి అనేకానేక విషయాలు మీడియాలో వచ్చాయి. వస్తున్నాయి… శరీర నిర్మాణ అనాటమీ కోణంలో చూస్తే ఏ మనిషికయినా అవే అవయవాలు. అదే పనితీరు. కానీ మెదడు పనితీరులో, మాటలో ఎవరికి వారు ప్రత్యేకం. […]
సివంగి..! కల్లోలిత జమ్ము కాశ్మీర్లో పోలీస్ ఆఫీసర్… ఎన్కౌంటర్ స్పెషలిస్ట్…!
చాన్నాళ్లుగా ఆమె వార్తల్లో లేదు… అసలు చాలామందికి ఆమె గురించి తెలియదు… మొన్న రిపబ్లిక్ దినోత్సవం రోజు సోనీ ఇండియన్ ఐడల్ వేదిక మీద కనిపించింది… ఆమెతోపాటు అనేకమంది ఆర్మీ, సీఆర్పీఎఫ్, నేవీ అధికారులు కూడా వచ్చారు… సింగర్స్ ఆరోజున దేశభక్తి గీతాలను ఆలపించారు… అదంతా వేరే సంగతి… ఆమె గురించి చెప్పనేలేదు కదూ… ఓ ఇన్స్పైరింగ్ స్టోరీ… పేరు షాహిదా పర్వీస్ గంగూలీ… కల్లోలిత పూంచ్ జిల్లాలో ఏదో మారుమూల పల్లెలో పుట్టింది… మొత్తం ఆరుగురు […]
వందే భారత్… ఈ రైలు క్రియేటర్నూ నంబి నారాయణన్లాగే వేధించారు…
Chada Sastry…. వాల్ మీద కనిపించిన ఈ పోస్టు ఇంట్రస్టింగుగా ఉంది… అంతకుమించి… వందే భారత్ రైలును ఆపడానికి ఎలాంటి కుట్రలు జరిగాయో కూడా పోస్టు చెబుతోంది… మన రైల్వేస్‌లో కూడా ఒక ఇస్రో నంబి నారాయణన్ ఉన్నాడు… వేధించబడ్డాడు… ఓసారి డిటెయిల్డ్గా చదవండి… అది 2016వ సంవత్సరం. సాధారణంగా, పదవీ విరమణ సమయంలో, చివరి 2 సం.లలో తనకు అనువైన ప్రాంతంలో తేలికైన బాధ్యత గల పోస్టింగ్ పొంది, ప్రశాంతంగా రిటైర్ అవ్వడానికి లేదా చివరి […]
సాహసివిరా… నీ కలానికి జగమే మొక్కేనురా… నీ కథను జనమే మెచ్చేనురా…
Taadi Prakash……….. సాహసివిరా! వరపుత్రుడివిరా!! THE SHOCKING STORY OF JON LEE ANDERSON .….. 023 jan 15 . Andersons 66th birthday ————————————————————- జాన్ లీ అండర్సన్ ! అమెరికన్ జర్నలిస్టుల్లో ఆజానుబాహుడు. దేశాలుపట్టి పోతుంటాడు. క్షణం తీరికలేని మనిషి దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, మిలిటరీ కమాండర్లు, ఆత్మాహుతి దళపతులు, డ్రగ్ మాఫియా లీడర్లు, నియంతలు, నరహంతకులతో మాట్లాడుతూనే వుంటాడు. అమెరికన్ సెవెన్ స్టార్ హోటల్లో ఈ రోజొక పెద్దనాయకుడ్ని కలుస్తాడు. రేపు […]
జగన్ ట్యాబ్స్ ఇచ్చాడు కదా… ఓ మహారాష్ట్ర స్కూల్ సక్సెస్ స్టోరీ చదవాలి మనం…
ఇంకా పలకలు, బలపాల కాలంలోనే ఉండిపోవాలని కోరుకుంటారు కొందరు… పల్లె పిల్లలకు ఆధునిక చదువు అక్కర్లేదనీ భావిస్తారు… అధికారమున్నా అడుగు ముందుకు వేయరు… కరోనా కాలంలో కష్టపడి కోట్ల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్లను కొనిచ్చారు పిల్లలకు… అయితే ఈ ఫోన్ల వల్ల పిల్లల్ని చెడగొట్టే దుష్ట సంస్కృతి వ్యాపిస్తున్నదనే భయసందేహాలున్నా సరే… ఎక్కడో ఓచోట స్టార్ట్ కావాలి, కరెక్షన్ కూడా జరగాలి… అంతేతప్ప, అసలు ఆవైపు అడుగులే వేయవద్దని ఆగిపోతే ఎలా..? జగన్ స్కూల్ పిల్లలకు […]
విధిని గెలవాలి… ఆస్వాదిస్తూనే, ఆనందిస్తూనే… అనారోగ్యాన్ని జయించాలి…
ఒక అనుభవం… సుదీర్ఘంగా రాస్తే చిన్న నవలిక… పెద్ద కథ… నిజానికి ఆమె రచయిత కాబట్టి ఇలా ఆసక్తికరంగా అక్షరబద్ధం చేసింది… చదువుతూ ఉంటే అసలు ఇవి కదా చదవాల్సినవి అనిపించింది… వోకే, అది కేన్సర్ కావచ్చు, మరో అనారోగ్య విపత్తు కావచ్చు, ఎదురైతే ఏం చేయాలి..? కుంగిపోవాలా..? ఫ్రస్ట్రేషన్లో పడిపోయి మరింతగా ఆ విపత్తుకు దాసోహం అనాలా..? నిరాశలో కూరుకుపోయి ఏడవాలా..? లేదు…! ధైర్యంగా ఉంటూనే, అవసరమైనది చేస్తూనే… జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఆనందిస్తూనే, విధి విసిరిన […]
ఈ నిఖార్సైన ప్రజావైద్యుడు ఇప్పుడేం చేస్తున్నాడు..? అసలు ఎవరీయన..?
వైద్యో నారాయణ హరి.ఈయనో వైద్యుడు. ఆరెమ్పీ కాదండోయ్! కొల్కతాలో ఎంబీబీఎస్, మైసూరులో ఎమ్డీ చదివాడు. చర్మవ్యాధుల నిపుణుడు. ఈయనకు క్లినిక్ అంటూ ప్రత్యేకంగా ఏమీలేదు. కర్నాటకలో ఇలా రోడ్డు పక్కనే కూర్చొని రోజూ వందలాది మందికి వైద్యం చేస్తుంటాడు. అన్నట్లు ఈ డాక్టరు ఫీజు ఎంతో తెలిస్తే మనం నిభిడాశ్చరంలో మునిగిపోతాం? కేవలం రెండు రూపాయలు మాత్రమే! అప్పట్లో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా కనిపించేది… కొన్నాళ్లు చల్లబడి, ఈమధ్య మళ్లీ కనిపిస్తోంది… నిజమేనా..? అసలు ఆ […]
సైన్స్, స్పిరిచువాలిటీ కలిసే చోట ఈయన పరిశోధన..!
i met one german scientist who research matter and conciousness
భేష్ ఈనాడు… ఇదుగో ఈ స్టోరీలే ఈరోజు అవసరం… అభినందనలు…
కంపు కొట్టే చెత్తా రాజకీయ బురద వార్తలతో దినపత్రికలు ఎప్పుడో డస్ట్ బిన్లు, డంపింగ్ యార్డులు అయిపోయాయి… డప్పులు, రాళ్లు… చివరకు రాజకీయ నాయకులంతా ఒకటే… ఆ దరిద్రాల నడుమ అప్పుడప్పుడూ కాస్త సుపాత్రికేయాన్ని, సమాజహితాన్ని ప్రదర్శించే కొన్ని మెరుపులు ఈనాడులోనే కనిపిస్తాయి… నిజానికి ఇప్పుడు సొసైటీకి ఈ పాజిటివిటీయే అవసరం… కానీ దరిద్రపు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకుంటే కదా… ఒక 88 ఏళ్ల వయస్సున్న యువ రైతు నెక్కంటి సుబ్బారావు గురించి ఈనాడు సండే […]
50 ఏళ్ల క్రితం… ఆస్ట్రేలియాకు వెళ్లి ‘‘పులియబెట్టే విద్య’’ను చదివింది…
బెంగుళూరులో పుట్టింది… గుజరాతీ తల్లిదండ్రులు… మధ్యతరగతి కుటుంబం… ఆమెకు డాక్టర్ కావాలని కోరిక… 1970… ఇరవయ్యేళ్ల వయస్సు… మెరిట్ ఉంది… డైనమిజం ఉంది… కానీ ఎందుకోగానీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా పాస్ కాలేకపోయింది… విధి లేక డిగ్రీలో జువాలజీ సబ్జెక్టు తీసుకుని చదవసాగింది… విదేశాల్లో స్కాలర్షిప్స్ ఇచ్చి వైద్యం బోధించే యూనివర్శిటీలకు అప్లయ్ చేసేది… ఉపయోగం లేదు… ఆమె పేరు కిరణ్ మజుందార్… తండ్రి రసేంద్ర మజుందార్ ప్రముఖ బీర్ల కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్లో హెడ్ […]
‘‘ఔనా, నిజమేనా..? ఇలాంటి తెలుగు జర్నలిస్టులు కూడా ఉండేవాళ్లా..?’’
చాలామంది చాలా రాస్తున్నారు… ప్రసిద్ధ పాత్రికేయులు సైతం ఈరోజు మరణించిన జర్నలిస్టు కేఎల్‌రెడ్డి గురించి స్మరించుకుంటున్నారు… 92 ఏళ్ల వయస్సులో కన్నుమూసిన ఈయన స్మరణీయుడే… ఎందుకంటే..? ఇలాంటి పాత్రికేయులు కూడా ఉండేవాళ్లా అనే ఆశ్చర్యం తన గురించి చదువుతుంటే..! బహుశా ఈతరం జర్నలిస్టులు ఎవరూ కేఎల్‌రెడ్డి గురించి చదువుతూ, అబ్బే, అంతా ఫేక్, ఇలాంటివాళ్లు ఎలా ఉంటారు అని తేలికగా తీసిపారేస్తారేమో… అసలు చాలామంది రాస్తున్నారు కదా, బుద్దా మురళి రాసిన ఓ పాయింట్ బాగా కనెక్టయింది […]
తేజస్వి రంగారావ్..! పుష్ప అనుకుంటిరా… ఫైర్..! తొలి లేడీ ఇండియన్ విజో..!
పార్ధసారధి పోట్లూరి …. భారతదేశ ఎయిర్ ఫోర్స్ చరిత్రలో మొదటిసారిగా ఒక మహిళ వెపన్ సిస్టమ్ ఆపరేటర్ గా నియమితురాలు అయ్యింది ! WSO [Weapon System Operator] లేదా ముద్దుగా విజ్జో [WIJJOs]గా పిలుస్తారు. మొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ ఈ ఘనత సాధించింది. ఫ్లయిట్ లెఫ్టినెంట్ Tejaswi Ranga Rao [తేజస్వి రంగారావ్ ] ఆమె పేరు…. ప్రస్తుతం లదాఖ్ దగ్గర మోహరించిన Su-30 MKI స్క్వాడ్రన్ లో జాయిన్ అయ్యింది. ఇంతకీ ఈ […]
- « Previous Page
- 1
- …
- 4
- 5
- 6
- 7
- 8
- …
- 13
- Next Page »