Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!

May 9, 2025 by M S R

. ముందుగా వార్త చదవండి… అవి రెండు మామిడి చెట్లు… ఉన్నవే ఏడు కాయలు… కానీ ఆ మామిడి కాయల ఓనర్ వాటి రక్షణకు ఏకంగా ఆరు వేటకుక్కలు, నలుగురు మ్యాంగో గార్డ్స్ పెట్టాడు… కిలోకు రెండున్నర లక్షల రూపాయల ధర పలికే ఈ మామిడి పళ్ల స్పెషాలిటీయే వేరు… అత్యంత అరుదైన రకం… అందుకే వాటి రక్షణకు ఇన్ని తిప్పలు, ఇంత ఖర్చు అంటూ నిన్న చాలామంది రాశారు, ఇంకా రాస్తూనే ఉన్నారు… ఇది మధ్యప్రదేశ్‌లోని […]

గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!

May 9, 2025 by M S R

. 24 U.S. states, 3 territories, and the District of Columbia …. గంజాయిని చట్టబద్ధం చేశాయనీ, మరికొన్ని ప్రాంతాలు మెడికల్ యూజ్‌కు అనుమతించాయనీ, ఇంకొన్ని ప్రదేశాల్లో స్వల్పమొత్తాల గంజాయి ఉన్నా నేరంగా పరిగణించడం మానేశాయనీ ఓ వార్త కనిపించింది… మరి గంజాయిని మనం ఎందుకు సరిగ్గా వాడలేకపోతున్నాం… ఏదో ఓ చర్చ ఎక్కడో మొదలవుతుంది… అది తరువాత ఎటెటో వెళ్లిపోతుంది… ప్రధాన చర్చలోనే కొన్ని ఉపచర్చలు కూడా పుట్టుకొస్తయ్… అవి నిజానికి ప్రధాన చర్చకన్నా […]

మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!

May 9, 2025 by M S R

. బహుభార్యత్వం… అధికారికంగానే చాలా దేశాల్లో చెల్లుబాటులో ఉంది… అనధికారికం సంగతి వదిలేయండి, చిన్నిల్లు, పెద్దిల్లు, మూడో ఇల్లు గట్రా బోలెడు ఉదాహరణలు మన సమాజంలోనూ ఉన్నవే… మగాధిపత్య ప్రపంచమే కదా అధికశాతం… మరి ఆడాధిపత్యం ఎలా..? అవి ఉన్న సమాజాలు కూడా ప్రపంచంలో చాలా ఉన్నయ్… కానీ ఆయా సమాజాల్లో కూడా సంప్రదాయికంగా వస్తున్నదే తప్ప అధికారిక బహుభర్తృత్వం ఉందానేది డౌటే… బహుభర్తృత్వం అంటే ఒక భార్యకు ఒకరికన్నా ఎక్కువ మంది భర్తలు ఉండటం… అధికారికంగా..! […]

పెళ్లిమండపంలా ఔట్ పేషెంట్ హాల్… నర్సులు, డాక్టర్లే పెళ్లి పెద్దలు…

May 4, 2025 by M S R

hospital

. ( రమణ కొంటికర్ల ) …. సాధారణంగా ఓ ప్రభుత్వాసుపత్రి అంటే రోగులు, వైద్యులు, నర్సులు, స్ట్రెచర్స్, స్కానింగ్ రూమ్స్ , మందులు, ఎవ్వరిని చూసినా మూతులకు మాస్కులు.. సర్వసాధారణంగానైతే, ఇదిగో ఇలాంటి వాతావరణం చూస్తాం. కానీ, సంబరాలు, డ్యాన్సులు, భాజాభజంత్రీలు ఎక్స్పెక్ట్ చేయగలమా..? కానీ, విధి ఆడే వింత నాటకం ఏదైనా చేయిస్తుంది. అందుకే, మధ్యప్రదేశ్ లోని ఓ ప్రభుత్వాసుపత్రి పెళ్లి వేదికైంది. రాజ్ గఢ్ జిల్లాకు చెందిన ఆదిత్య సింగ్, నందినీ సోలంకి వివాహం […]

స్నేహమాంద్యం..! మన సొసైటీల్లో విపరీతంగా పెరుగుతున్న ఏకాకితనం..!!

May 3, 2025 by M S R

friends

. ఓ సర్వే, ఓ అధ్యయనం ఆసక్తికరంగా అనిపించింది… వాట్సప్ గ్రూపుల్లో కనిపించింది కాబట్టి సందేహించి చెక్ చేస్తే ఆ సర్వే నిజమేనని తెలిసింది… దాన్ని సరళమైన తెలుగులోకి ఎవరో గానీ బాగా సంక్షిప్తీకరించి, తర్జుమా చేశారు… స్నేహమాంద్యం అనే పదాన్ని కాయిన్ చేయడం మరీ నచ్చింది ఆ సంపాదకుడు ఎవరో గానీ… అవును, అందరికీ తెలిసిన ఆ బుద్దిమాంద్యం, ఆ ఆర్థికమాంద్యంలాగే ఈ స్నేహమాంద్యం కూడా… మాంద్యమే, రాహిత్యం కాదు… Friendship recession… ఈమధ్య పరిచయాలు […]

యోగీ… గంగలో దొరికిన ఆ శకుంతలకు నిజంగా కణ్వుడివి అయ్యావా..?

May 1, 2025 by M S R

. మహాభారతంలో కుంతి తన దైవ సంతానమైన కర్ణుడిని నదీప్రవాహంలో ఓ పెట్టెలో పెట్టి వదిలేసింది… ఆ పెట్టె ఏదో ఓ గట్టుకు చేరుతుందని, ఎవరో చేరదీస్తారని అనుకుంది… అదీ ప్రేమే..! అసలు ఆ శిశువు బతికే ఉండకూడదని అనుకుంటే ఎక్కడో పూడ్చి వేయించేది… ఆ కర్ణుడికి సమయానికి అతిరథ నందుడు అనే సూతుడు, రాధ అనే మంచి తల్లి దొరికింది… కాదు, వాళ్లకే తను దొరికాడు… కథ అలా సాగింది… దేశంలో చెత్త కుండీల్లో పడిన […]

సహదేవుడికి కృష్ణుడి పట్టాభిషేకం..! యుద్ధంలో శకుని చేతిలో వీరమరణం..!!

April 30, 2025 by M S R

. ….. దుఖంలో ఉన్న సహదేవుడిని ఓదార్చి, కర్మ ఫలాన్ని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని హితోక్తులు చెప్పి కృష్ణుడు, అర్జునుడు, భీముడు తనను పట్టాభిషిక్తుడిని చేస్తారు….. కురుక్షేత్రంలో శకుని సహదేవుడిని హతమారుస్తాడు…. అరెరె, ఇదేమిటి..? సహదేవుడికి పట్టాభిషేకం ఏమిటి..? పైగా స్వయంగా భీమకృష్ణార్జునులు చేయడం ఏమిటి..? కురుక్షేత్రంలో సహదేవుడిని శకుని చంపేయడం ఏమిటి..? అంతా గందరగోళంగా ఉన్నట్టుగా ఉందా..? మీరు చదివింది నిజమే… కాకపోతే ఈ సహదేవుడు వేరు..? భారతంలో ఇది మరో విశేషమైన పాత్ర… […]

నేను లేక భారతమే లేదు… కట్టుబాట్లు ఛేదించినా ఎప్పుడూ సుఖం లేదు…

April 27, 2025 by M S R

satyavati

. అసలు భారతం ఎంత పెద్ద గ్రంథం అయితేనేం… భారతం లేకుండా దేశం లేదు, నేను లేక భారతం లేదు… నేనే ప్రథమ పాత్ర… ప్చ్, కానీ నన్నెవరూ పట్టించుకోరు… ఆ కాలమాన సంప్రదాయాల్ని, కట్టుబాట్లను ఛేదించాను, తిరగబడ్డాను, అలాగే బతికాను… అయితేనేం, ప్రతిచోటా నాకు నిరాశే మిగిలింది… నేను అనుకున్నట్టు జరిగి ఉంటే భారత కథ వేరే ఉండేది… అసలు ఆ కథే ఉండేది కాదేమో… తప్పేమీ అనిపించలేదు… మా కులంలో సమ్మతమే అంటారు… ఓరోజు […]

‘‘రెండు చేతులతోనూ తడిమి, నిమిరి.., ఉన్నట్టుండి గభీగభీమని గుద్ది…’’

April 26, 2025 by M S R

hidimbi

. ‘‘భీముడు ఎదురుగా నిలబడగానే పాలకటకంటి అతని రెండు భుజాలను బిగువుగా పట్టుకుంది… అదే శక్తిమంతమైన చేతిపట్టు… అనంతరం ఒళ్లూ, చేతులూ, ముఖాలను తన రెండు  చేతులతోనూ తడిమి, నిమిరి, ఉన్నట్టుండి పక్కకు అడుగువేసి వీపు మీద ఏడెనిమిదిసార్లు గుద్దింది… ముఖం బిరుసెక్కింది… కళ్లు ఎరుపయ్యాయి… నోట్లో ఊరకే భీమ, భీమా అనుకుంటూ రెండు చేతుల్ని పిడికిళ్లు బిగించి గుద్దింది… అతను ఊరకే తలవంచి నిల్చున్నాడు… పిడికిలి సడలించి వీపు మీద, రెట్టల మీద ఫటఫటా పదే […]

కౌసల్యను ఎత్తుకుపోయిన రావణుడు..! రాముడి అక్కకూ ఓ గుడి ఉంది…!

April 25, 2025 by M S R

. వాల్మీకి రామాయణంలో కనిపించకపోవచ్చుగాక… వేలాది కళారూపాల్లోకి రామాయణం విస్తరించేకొద్దీ అనేక చిత్రవిచిత్రమైన ఉపకథలు వచ్చి చేరాయి… చాలామందికి తెలియని కథ, చాలా ఆసక్తికరమైన పాత్ర… రాముడి సోదరి శాంత..! ముందుగా దశరథుడు- కౌసల్య పరిణయం దగ్గర నుంచి మొదలుపెడదాం… నీ చెల్లెలి కొడుకే నిన్ను చంపుతాడు అని కంసుడికి ఆకాశవాణి చెప్పినట్టుగా… రావణుడికి కూడా ఫలానా కౌసల్య కొడుకు చేతుల్లో నువ్వు మరణిస్తావు అని అశరీరవాణి ఏదో హెచ్చరిస్తుంది… దాంతో రావణుడు కోసల రాజ్యానికి రహస్యంగా […]

మండోదరి… ఆమె చుట్టూరా ఎన్నెన్నో కథలు… పరమ సంక్లిష్టమైన కేరక్టరైజేషన్…

April 24, 2025 by M S R

mandodari

. రామాయణం మొత్తం చదివినా మనకు రావణుడు, రాముడు, సీత, కైకేయి, హనుమంతుడు, లక్ష్మణుడు తదితరుల పేర్లే పదే పదే తగుల్తుంటాయి… వాటి గురించే ప్రవచనకారులు బాష్యాలు చెబుతుంటారు… కానీ కొన్ని పాత్రలు ప్రాధాన్యమైనవే అయినా పెద్దగా ప్రాచుర్యంలోకి రావు, ఎవరూ పెద్దగా పట్టించుకోరు… అలాంటి పాత్రల్లో ముఖ్యమైనది మెయిన్ విలన్ రావణుడి పట్టమహిషి మండోదరి… మండూకం అంటే కప్ప… కప్పలాంటి కడుపు కలిగినది అని ఏవేవో పిచ్చి విశ్లేషణలు చేస్తారు గానీ… ఆమె సౌందర్యవతి… సీత […]

రాముడితో రామేశ్వర తీరంలో శివ హోమం చేయించిన రావణబ్రహ్మ..!!

April 22, 2025 by M S R

rameswaram

. కోరాను స్క్రోల్ చేస్తుంటే ఓచోట చూపు నిలిచిపోయింది… ఓ పిచ్చి కథ… చదవగానే కోపం వచ్చింది… పురాణాలను ఎవరికివారు ఇలా ఇష్టానుసారం మార్చేయడం దేనికి..? ప్రత్యేకించి వేల ఏళ్లుగా పూజించబడుతున్న పవిత్రగ్రంథాలకు సంబంధించి ఏం రాయాలన్నా, వాటిని విశ్వసించేవారి ఫీలింగ్స్ పరిగణనలోకి తీసుకోవాలి కదా అనిపించింది… కానీ మళ్లీ మళ్లీ చదివితే… వింతగా ఉన్నా సరే, మూర్ఖపు క్రియేటివిటీ, చిత్తపైత్యంలా అనిపిస్తున్నా సరే… ఆయా పురాణ పాత్రల గొప్పతనాల్ని ఎలివేట్ చేస్తున్నట్టుగానే ఉంది… ఆ పాత్రలు […]

కమలక్క లేఖ సరే గానీ… ఉషక్క హఠాత్ పర్యటనకూ అదే రీజనేమో..!!

April 21, 2025 by M S R

nirmala jaggareddy

. నాకు నమస్తే తెలంగాణ స్టోరీ చదవగానే ఏదో తేడా కొడుతోంది అనిపించింది… వాళ్లు నిజాలు తప్ప మరొకటి రాయరు కదా… ఇదీ నిజమే అని ఫిక్స్… నీళ్లను కూడా నిప్పులతో పుటం పెట్టే పాత్రికేయం కదా… సరే, ఆ వార్త ఏమిటయ్యా అంటే… డెమొక్రాట్స్ పార్టీ, మొన్నమొన్నటిదాకా అమెరికా సెకండ్ లేడీ, మన చెన్నై సాంబర్ ఇడ్లీ రూట్స్ కమలా హారిస్ ఉంది కదా… ఆమె ఒక తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి మంత్రి పదవి […]

రావణ పరిచారిక..! ఐతేనేం… దేవతను చేశాం, గుళ్లు కట్టి పూజిస్తున్నాం..!

April 20, 2025 by M S R

trijata

. రామాయణం అనగానే… రామాయణంలోని పాత్రలు గుర్తొస్తయ్ కదా… అందులో నరులు, వానరులు, రాక్షసులే కాదు… జటాయువు వంటి పక్షులు, జాంబవంతుడు వంటి ఎలుగుబంట్లు, చివరకు వంతెన కోసం రాళ్లెత్తిన కుందేలు… ఇలా చాలా జీవ జంతు పాత్రలు కూడా ఉన్నయ్… మళ్లీ ఆ నరుల్లోనూ కైకలు, మంథరలు… వానరుల్లో వాలి… రాక్షసుల్లో రావణాసురుడు, కుంభకర్ణుడు… హీరోలు, సైడ్ హీరోలు, హీరోయిన్లు, సైడ్ హీరోయిన్లు, విలన్లు, ఇతరత్రా పాత్రలు, అనేక తత్వాలు కూడా… చాలా కీలకపాత్రే అయినా […]

ఆ కౌరవ యువరాణి..! అందరికీ గారాలపట్టి..! ఐతేనేం… ఓ విధివంచిత..!!

April 19, 2025 by M S R

. మహాభారతంలోనే చాలామందికి తెలియని కథ… చదవాల్సిన కథ… చెబితే భారతమంత… అందుకే సంక్షిప్తంగా చెప్పుకుందాం… ఆమె పేరు లక్ష్మణ… కురు సార్వభౌముడు దుర్యోధునుడి భార్య భానుమతి… వారణాసి రాజు బిడ్డ… ప్రతి రాజుకూ బోలెడుమంది భార్యలు… కానీ దుర్యోధనుడికి కేవలం భానుమతి ఒక్కతే… ఏకసతీవ్రతుడు… వాళ్లకు ఇద్దరు కవల పిల్లలు… మగ, ఆడ… లక్ష్మణకుమారుడు, లక్ష్మణ… లక్ష్మణకుమారుడి కథను మనం మాయాబజార్ సినిమాలో చూస్తాం… బలరాముడి కూతురు శశిరేఖతో లక్ష్మణకుమారుడికి పెళ్లి చేయాలని అనుకోవడం, కృష్ణుడు […]

మౌనం ఓ రహస్య సమ్మతి… అది ద్రోహం, నేరం… అనగా మౌనమూ శిక్షార్హమే…

April 17, 2025 by M S R

bhishma

. ‘‘ప్రశ్నించాల్సిన చోట, ప్రశ్నించే స్థోమత ఉన్నచోట… ఒక తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించకుండా నిశ్శబ్దంగా ఉండిపోవడం… ఒక తప్పుకు రహస్య సమ్మతి తెలిపినట్టే… అంటే ధర్మానికి ద్రోహం చేసినట్టే… ద్రోహం అంటే తప్పు… తప్పు అంటే నేరం… మరి నేరానికి శిక్ష తప్పదు కదా… ’’ Silence is connivance.. Connivance is betrayal.. Betrayal is sin.. Sin is a punishable offence…… మనం బతుకుతున్న వాతావరణంలో మనకు నచ్చని అనేకానేక మౌనాల్ని గమనిస్తున్నప్పుడు, ఇలా […]

ప్రస్తుత సోషల్ మీడియా క్షుద్ర నీతికి ఆదిగురువు… కణికుడు..!!

April 16, 2025 by M S R

kanika

. పొలిటికల్ స్ట్రాటజిస్టుుల, సలహాదారులు ఇప్పుడే కాదు… మహాభారత కాలం నుంచీ ఉన్నారు..! ఈ ప్రశాంత్ కిశోర్‌లు, రాబిన్ శర్మలు, సునీల్ కనుగోలులు, అనేకానేక మంది సలహాదారులు ఏ కేటగిరీలోకి వస్తారో తెలియదు, ఖజానాల నుంచి, పార్టీల బొక్కసాల నుంచి ప్రజల సొమ్మును ఎందుకు తినేస్తారో తెలియదు కానీ… ఓసారి మనం అలా భారతకాలానికి వెళ్లొద్దాం… మనకు చాణక్యనీతి తెలుసు… తను సాధించిన పగ, పన్నిన వ్యూహాలు, ఆ బుర్ర చురుకుదనం, ఆయన రాసిన ఆర్థికశాస్త్రాలు, పాలన […]

హిడింబి… మహాభారతంలో ఓ మార్మిక పాత్ర… ఆ గుడిలో దేవత…

April 14, 2025 by M S R

hidimbi

. చాలామంది ఈ తరం యువతకు ఓ డౌటొచ్చింది… రాక్షస జాతికి చెందిన వేరే పురాణ పాత్రలకూ గుళ్లున్నాయా..? ఇలా అనగానే గుర్తొచ్చేది హిడింబి గుడి… అదే ఎందుకు గుర్తురావాలి..? హిడింబి గుడి ఉన్నది మనాలి‌లో… చాలామంది టూరిస్టులు మనాలి వెళ్తుంటారు కదా, హిడింబి గుడి కూడా వెళ్లొస్తుంటారు… కానీ హిడింబి మన మనిషి, పూజించాల్సిన దేవత ఎలా అయ్యింది..? మహాభారతంలో ఓ అంతుచిక్కని మార్మిక పాత్ర హిడింబి… తన కళ్ల ముందే తను బాగా అభిమానించే […]

Destiny..! ఆ ఘడియ తరుముకొస్తే ఆ శ్రీకృష్ణుడికే తప్పలేదు… మనమెంత..?!

April 8, 2025 by M S R

. కరోనాకాలంలో చెప్పుకున్నట్టు…  ఒక సమయం వస్తుంది… ఆ టైం తరుముకొచ్చినప్పుడు… నీ హోదాలు, నీ డబ్బులు, నీ ఆస్తులు, నీ అంతస్థులు, నీ సర్కిళ్లు… ఒక్కటి, కనీసం ఒక్క హాస్పిటల్ బెడ్ ఇప్పించలేవు… కాసింత ఆక్సిజన్ ఇప్పించలేవు… ఒక్క రెమ్‌డెసివర్ ఇప్పించలేవు… అంతెందుకు స్మశానంలో ప్రశాంతంగా కాలనివ్వవు… మరీ రోజులు బాగాలేకపోతే… బంధుగణం ఎవరూ ఉండరు… ఎవరో నలుగురు హాస్పిటల్ సిబ్బంది ‘డ్యూటీ’లాగా కాల్చేసి నిష్క్రమిస్తారు… ఎగ శ్వాస తన్నుకుంటూ ఐసీయూలో విలవిల్లాడుతూ… ‘‘ధైర్యము విలోలంబయ్యె, […]

కర్ణ-కృష్ణ సంభాషణ… కౌగిలించుకున్న రెండు సమాంతర రేఖలు…

March 23, 2025 by M S R

karna

. ఆమధ్య కల్కి సినిమా రిలీజు తరువాత కర్ణుడు గొప్పవాడా కాదా అని పెద్ద చర్చే జరిగింది సోషల్ మీడియాలో… ఎవరి అభిప్రాయాలు వాళ్లవి… నిన్న ఏకలవ్య సినిమా రివ్యూ పబ్లిష్ చేస్తున్నప్పుడు కూడా ఓ చర్చ… నిజానికి ఏకలవ్యుడిది కూడా కుంతి కుటుంబ రక్తమేననీ, పాండవుల సోదరుడేనని…! తను కూడా కృష్ణుడికి రక్తబంధువునని..! అంటే కర్ణుడు, ఏకలవ్యుడు కథలు దాదాపు సమానమే, దారులు వేరు, గమ్యాలు వేరు… ఇదే రాస్తుంటే, ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ముచ్చట […]

  • « Previous Page
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • …
  • 17
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…
  • యోగీ భాయ్… ఎవరో గానీ నిన్ను ముందుజాగ్రత్తగా తొక్కేస్తున్నారు భయ్యా…
  • ‘‘గతేడాది బతికే ఉన్నానేమో గుర్తులేదు.., ఇప్పుడయితే బతికే ఉన్నా.,.‘‘
  • బీసీ రిజర్వేషన్లు… క్రెడిట్ రేవంత్‌రెడ్డిది… ఎవరెవరో హైజాక్ ప్రయత్నాలు…
  • కీచక ప్రజ్వల్ కేసు..! న్యాయవ్యవస్థపై ఆశల్ని బతికించే తీర్పు..!!
  • వినుడు వినుడు విజయవాడ వెతలూ… వినుడీ జనులారా..!!
  • ఎవరు నిజమైన జర్నలిస్టు అనే ప్రశ్న సరే… అసలు జర్నలిస్టు అంటే ఎవరు..?
  • ఆహ్లాదానికీ అసభ్యతకూ నడుమ గీత చెరిపేశాడు రాఘవేంద్రుడు..!!
  • జాతీయ అవార్డు పొందిన ఆ కాసర్ల శ్యామ్ పాట ఎందుకు నచ్చిందంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions