Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జనం సొమ్ము… నగలు, ఫ్యాషన్లు… వందల కోట్ల విలాస ప్రదర్శన…

May 7, 2026 by M S R

MEGHA REDDY

. నడమంత్రపు సిరి అనే పదం వాడొచ్చో లేదో తెలియదు… ఈ సిరి మనిషిని ఎటో తీసుకుపోతుంది… ఆ సిరి సంపద ప్రదర్శన ఉబలాటానికి, తన సర్కిల్‌లో తానే వెరీ వెరీ అప్పర్ హ్యాండ్ అనే ఎగ్జిబిషనిజానికి దారి తీస్తుంది… ఇలాంటివాళ్లు సమాజంలో బోలెడు మంది… మేఘా కృష్ణారెడ్డి భార్య సుధారెడ్డి ఎగ్జిబిషన్ కూడా ఇదే కోవలోకి వస్తుందా..? విజ్ఞులు చెప్పాలి… అప్పుడెప్పుడో సాదాసీదా కంట్రాక్టర్ తను… తనకు నాయకులను ఎలా పట్టుకోవాలో తెలుసు… నాయకుల్ని ఎలా […]

సుప్రీం చీఫ్ జస్టిస్ భలే ప్రశ్న… ఎందుకీ పిల్… నీకేం సంబంధం…

May 7, 2026 by M S R

shabari

. Pardha Saradhi Upadrasta …  శబరిమల PILపై సుప్రీంకోర్టు స్ట్రాంగ్ కామెంట్స్! శబరిమల అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. కానీ ఈసారి ఫోకస్ ఆలయం కాదు.. PILల అసలు ఉద్దేశం మీదే! సీజేఐ షాకింగ్ కామెంట్… భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ:.. “ఆ PIL అప్పుడే చెత్తబుట్టలో వేయాల్సింది!” అన్నారు… పిటిషనర్ అర్హతపై సందేహం… ధర్మాసనం అసలు పిటిషనర్ locus standi (అర్హత) , ఉద్దేశాన్ని ప్రశ్నించింది. Indian Young Lawyers Association […]

DMK + AIDMK…! ఇదే జరిగితే తమిళ రాజకీయాల్లో చరిత్రాత్మకం..!!

May 7, 2026 by M S R

dravid politics

. తమిళ రాజకీయాలు గంటగంటకూ అనుకోని మలుపులు తిరుగుతూ… హీరో విజయ్ సినిమాకన్నా ఉత్కంఠభరితంగా రక్తికడుతున్నాయి కదా… ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారనేది కాదు, నెంబర్ గేమ్… ఏం చేసినా తనకు మెజారిటీ లభించేట్టు లేదు… సరైన మెజారిటీ మార్గాలేమిటో, నిరూపణ ఏమిటో చూపించనిదే నేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించను అని భీష్మించాడు గవర్నర్… ఈ స్థితిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను పక్కన పడేసి… రెండు ద్రవిడ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయా..? దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్న […]

క్యాచ్ మిస్… మ్యాచ్ మిస్… దరిద్రపు ఫీల్డింగులో పంజాబ్ టాప్…

May 7, 2026 by M S R

pbks vs srh

. ఇది ఐపీఎల్… బాల్ బాల్‌కూ సిట్యుయేషన్ మారిపోయేంత టఫ్ ఫైట్స్… వరుస పరాజయాలతో ఇక కథ ముగిసినట్టే అనుకున్న చెన్నై జట్టు కూడా టాప్ 6 లోకి చేరి, నేనూ ప్లే ఆఫ్‌కు రెడీ అంటోంది ఇప్పుడు… మొదట్లో పరాజయాలతో షాక్ తిన్న హైదరాబాద్ జట్టు కొన్ని మార్పులు చేసుకుని, ఇప్పుడు టాప్ వన్ ప్లేసులోకి చేరింది పంజాబ్ జట్టును రాత్రి ఓడించి… ఇది తప్పకుండా ప్లేఆఫ్ జట్టే… ఇక్కడ చెప్పాల్సింది పంజాబ్ జట్టు గురించి… […]

హైదరాబాద్… అల్ట్రా లగ్జరీ ఇళ్లకు అల్టిమేట్ డెస్టినేషన్…

May 6, 2026 by M S R

అల్ట్రా లగ్జరీ

. హైదరాబాద్… అల్ట్రా లగ్జరీ ఇళ్లకు అల్టిమేట్ డెస్టినేషన్… అంటే 10 కోట్లకు పైబడిన విలాస గృహాలు… అవును, ప్రస్తుతం అల్ట్రా లగ్జరీ రంగంలో హైదరాబాద్ టాప్… సురక్షితమైన, నివాసయోగ్యమైన హైదరాబాద్‌ను భావిస్తున్నాయి ధనికవర్గాలు… ఎంతగా అంటే… ఆర్థిక సంవత్సరం 2026 (FY-26) లో హైదరాబాద్ ఏకంగా ₹8,562 కోట్ల విలువైన విలాసవంతమైన గృహ విక్రయాలను నమోదు చేసి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది… అంటే… ప్రస్తుతం అల్ట్రా లగ్జరీ కేటగిరీకి […]

అర్ధరాత్రి దాటింది… ఆ బస్టాపులో ఆమె ఒంటరిగా… ఏం జరిగింది..?

May 6, 2026 by M S R

sumathi ips

. అర్ధరాత్రి దాటింది… బస్టాండులో… ఓ మహిళ… ఒంటరిగా…! ఏమైనా సాయం కావాలా..? ఏమైనా సమస్యా..? ఇంత రాత్రి ఏం చేస్తున్నావు..? అని అడిగే మగాడు ఉంటాడా..? లేదు… ఉండడు… మరి ఎలాంటి మగాళ్లు కనిపిస్తారు..? సింపుల్… వస్తావా…? ఎంతివ్వాలి..? ఎటు వెళ్దాం… ఇవే ప్రశ్నలు మీదిమీదికొస్తూ..! నిజమే కదా… అందరికీ తెలిసిందే కదా అంటారా..? అలా అర్ధరాత్రి దాటాక, అలా ఓ బస్టాపులో నిలబడి… ఫీల్డ్ సిట్యుయేషన్ ఏమిటో తెలుసుకోవాలని, అదుపు తప్పిన వాళ్లకు కాస్త […]

విజయ్ మెడలో కరుంగాలిమాల..! ఈ నమ్మకం, ఈ మాల విశిష్టత ఏంటంటే..?!

May 6, 2026 by M S R

విజయ్

. విజయ్ జోసెఫ్ నామినేషన్లు దాఖలు చేసినప్పటి ఫోటోలు చూశారా..? తన మెడలో కరుంగాలి మాల కనిపిస్తుంది… అది అదేనా..? మరోరకం గొలుసా..? ఇది ఏమిటనే సందేహం వచ్చిందా మీకు..? తను క్రిస్టియన్ కదా… మెడలో అది క్రాస్ ఉన్న చెయినా..? తండ్రి క్రిస్టియనే అయినా తల్లి హిందూ బ్రాహ్మిణ్ కదా, ఆమె విశ్వాసాల మేరకు విజయ్ ఏదైనా హిందూ సంబంధ మాలను ధరించాడా..? అవును, అది కరుంగాలి మాల… ఇది నల్లమద్ది (Ebony) చెట్టు కాండం […]

కొన్ని జిల్లాల్లో జీరో సీట్స్..! ప్రాంతీయమా..? ఉపప్రాంతీయ పార్టీలా..?!

May 6, 2026 by M S R

tamilnadu

. తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే… ఒకటి విశేషంగా అనిపించింది… టీవీకే విజయ్ ప్రభంజనం అని అందరూ రాస్తున్నారు కదా… మరో ఎంజీఆర్, మరో ఎన్టీఆర్ అని ఆకాశానికి ఎత్తుతున్నారు కదా… గెలుపు వరకూ నిజమే… కానీ అవసరమైన మెజారిటీకి పదీపదకొండు స్థానాలలోపే ఆగిపోయాడు విజయ్… సరే, గెలుపు గెలుపే… ప్రధాన రెండు ద్రవిడ పార్టీల కూటములు చిత్తయ్యాయి కదా, స్థూలంగా విజయ్‌దే అసలు గెలుపు… అయితే..? మెజారిటీ సాధనకు ఎవరు కలిసొస్తారనేది పక్కన పెడితే… కన్యాకుమారి, […]

ఇక పంజాబ్‌పై బీజేపీ కన్ను..! ‘ఆప్’ను మరింత తొక్కడమే టార్గెట్..!!

May 6, 2026 by M S R

పంజాబ్

. బెంగాల్ కోట ఆక్రమించుకున్నాం… ఇక వాట్ నెక్స్ట్? బీజేపీ వర్గాల్లోనే కాదు, జాతీయ రాజకీయాల్లో ఇదే చర్చ నిన్నటి నుంచీ… కాస్త వివరంగా చెప్పుకోవాలి ఇది… అయిదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి కదా… ఇక ఈ సంవత్సరం ఎన్నికల్లేవు… వచ్చే ఏడాది (2027) ప్రారంభంలో మళ్ళీ ఎన్నికల హడావిడి మొదలవుతుంది… అవి కీలకమైన ఎన్నికలు… పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా… వీటిల్లో ఉత్తరప్రదేశ్ రాజకీయంగా ఎంత కీలకమైందో తెలుసు కదా… అక్కడ అధికారం నిలుపుకునే […]

క్రిస్టియన్… దళిత్ కాదు… తన కులానికీ ఓ చరిత్ర… హైదరాబాద్‌కూ లింక్స్…

May 6, 2026 by M S R

విజయ్

. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ జోసెఫ్ అలియాస్ హీరో విజయ్ అలియాస్ టీవీకే విజయ్ వ్యక్తిగతం మీద ఎవరెవరో ఏవేవో రాసేస్తున్నారు… వాళ్ల ఫ్యామిలీ చిత్తూరు నుంచి వలస పోయిందని కొందరు తనమీద తెలుగు ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు… తను దళితుడనీ రాస్తున్నారు… నిజాలేమిటో చూద్దాం… రకరకాల సమాచారాన్ని వడబోసిన తరువాత… విజయ్ దళితుడు కాదు… వాళ్లది వెల్లలార్ కమ్యూనిటీ… ఇది స్వతహాగా భూస్వామ్య సామాజికవర్గం… తమిళనాడు, కేరళ, శ్రీలంకల్లో ఎక్కువగా విస్తరించి […]

కొరడా పట్టుకో సీఎం సారూ… లేకపోతే నీ కళ్లకే గంతలు కడతారు…

May 6, 2026 by M S R

ఇంటర్ బోర్డు

. రేవంత్ రెడ్డికి ఇక తప్పదు… తన కళ్లకు గంతలు కడుతూ, తన నిర్ణయాల్ని లైట్ తీసుకుంటూ, అమలు చేయడానికి విముఖంగా ఉన్న కొందరు ఉన్నతాధికారులపై కొరడా ఎత్తాల్సిందే… లేకపోతే మరింతగా బ్యూరోక్రాట్లు పాలనను మరింత దెబ్బతీస్తారు… పక్కా ఉదాహరణ, తన పరిధిలోనే ఉన్న విద్యా శాఖ… కాస్త వివరంగా చెప్పుకుందాం… రేవంత్ రెడ్డి నిర్ణయం ఏమిటి..? కేంద్ర ప్రభుత్వ విద్యావిధానం మేరకే రాష్ట్రంలోనూ స్కూలింగ్ ఉండాలని… అంటే టెన్ ప్లస్ టు… ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు […]

మమత మట్టికరిచింది… ఆ దుర్గగుడి తలుపులు తెరుచుకున్నయ్…

May 6, 2026 by M S R

asansol durga

. చార్మినార్… హైదరాబాద్ పాతబస్తీలో ఉన్న చారిత్రిక కట్టడం… దాని దిగువన భాగ్యలక్ష్మి గుడి… భక్తులు వస్తుంటారు, పోతుంటారు, ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి… రెండు మతాల ప్రజలు సంయమనం పాటిస్తారు… సరే, ఓసారి తమిళనాడు వెళ్దాం… తిరుప్పరంకుండ్రం కార్తీకదీపం కథ మనం నిన్న చెప్పుకున్నాం కదా… సాక్షాత్తూ హైకోర్టు అక్కడ హిందూ భక్తులు కార్తీకదీపం వెలిగించుకోవచ్చునని చెప్పినా సరే… అధికార యంత్రంగం వినలేదు, కారణం, అరివీర భీకర హిందూ వ్యతిరేకి స్టాలిన్ వల్ల… చివరకు ఆ […]

‘‘తిక్కలదిర ఈ అక్క… వేగలేము ఈ అక్కతో… ఆడలేము తైతక్క…’’

May 5, 2026 by M S R

మమత

. మమత బెనర్జీ తాజా ప్రకటన వినగానే… తెలుగులో ఓ పాట గుర్తొచ్చింది… ఆప్ట్ అయినా కాకపోయినా… ‘‘తిక్కలదిర నీయక్క, వేగలేము నీయక్కతో, ఆడలేము తైతక్కా’…. నవ్వొచ్చింది… ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసింది, కేంద్ర మంత్రిగా చేసింది, దశాబ్దాలపాటు రాజకీయాల్లో ఉంది… ఈరోజుకూ ఆమెకు ఓ రాజకీయ సంస్కారం లేదు, ప్రొటోకాల్ మర్యాద తెలియదు… జనం థూత్కరించి, కర్రు కాల్చి వాతలు పెట్టి… ఎహె దిగిపో అని చాటినా సరే… నో, నో, నేను ఓడిపోలేదు, నేను రాజీనామా […]

నో… వోట్ల తొలగింపుతో బీజేపీకి ఫాయిదా అనేది ఉత్త బోగస్ వాదన…

May 5, 2026 by M S R

సర్

. రాహుల్ గాంధీకి సొంత విచక్షణ, వివేచన గట్రా ఏమీ ఉండవని తెలుసు కదా… కుట్ర, 100 సీట్లు నాకు రాకుండా చేశారు, అమిత్ షా దుర్మార్గం, నన్ను కొట్టారు, జుట్టు పట్టి ఈడ్చారు అని మమత మొసలి కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇప్పటికీ… సరే, ఆమె ధోరణి తెలుసు కదా, మరి రాహుల్ గాంధీ కూడా దాన్ని సమర్థిస్తూ పోస్ట్ పెట్టడం ఏమిటి..? బెంగాల్‌లో పాతాళంలోకి తొెక్కింది మమత… రేప్పొద్దున నిజంగానే ఇండి కూటమికి మెజారిటీ వస్తే […]

‘లాటరీ’ తగిలింది… ఆ ’ఫ్యామిలీ’ గెలిచింది… అల్లుడు కాబోయే మంత్రి…

May 5, 2026 by M S R

Martin

. వేల కోట్ల రూపాయల లాటరీ, ఇతర దందాలు… దేశంలోని ప్రముఖ పార్టీలన్నింటికీ విస్తృతంగా, ధారాళంగా చందాలు… బోలెడు కేసులు… వివాదాలు… మనం ఈ ఎన్నికలకు ముందు చెప్పుకున్నాం కదా… ది ఫేమస్ లాటరీ కింగ్ Santiago Martin కుటుంబం ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగింది.., ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు మూడు వేర్వేరు పార్టీల్లో పోటీ చేయడం విశేషంగా నిలిచింది… మరి వాళ్లు గెలిచారా..? మార్టిన్ ఎత్తుగడ ఫలించిందా..? ఎస్… ముందుగా ఆయన కథేమిటో, […]

బీజేపీని గెలిపించేది- సోకాల్డ్ సెక్యులర్ పార్టీల ‘సంతుష్టీకరణ’ పోకడలే…

May 5, 2026 by M S R

అస్సాం

. సెక్యులర్ అంటే ముస్లిం సంతుష్టీకరణ… మన పార్టీలకు అర్థమైంది అదే… నిజానికి ఈ ధోరణే బీజేపీకి ఉపయోగపడుతోంది… హిందూ వోటు సంఘటనకు బీజేపీ దీన్ని వాడుకుంటోంది… పక్కా ఉదాహరణ ఏమిటంటే..? నిన్నటి బెంగాల్, అస్సాం ఫలితాలు… కేరళ, తమిళనాడు గురించీ చెప్పుకుందాం, కానీ ముందుగా బెంగాల్… మమతా బెనర్జీ బంగ్లా అక్రమ వలసదారులకు మద్దతు… వాళ్ల వోట్ల కోసం దేశభద్రతనే పణంగా పెట్టేంత తెంపరి తను… చివరకు ఏం జరిగింది..? గతంలో ఎన్నడూ లేనంతగా హిందూ […]

ఆ మమతా దిగిపోయింది… ఇక మిగిలింది ఒకేఒక లేడీ సీఎం…

May 5, 2026 by M S R

లేడీ సీఎంలు

. మొన్నమొన్నటిదాకా మహిళా రిజర్వేషన్లు దేశంలో ఓ చర్చనీయాంశం… అఫ్‌కోర్స్, దశాబ్దాలుగా ఈ అంశం చర్చనీయాంశమే… అడ్డంకులు దాటవు, ఆ రిజర్వేషన్లు కూడా ఎంతకూ సాకారం కావు… సరే, ఆ కథ వేరు… కానీ అవి సాకారం అయినప్పుడు రాష్ట్రాలవారీగా సీట్లలో రిజర్వేషన్లు ఇస్తారు సరే, కానీ దేశం మొత్తం ఓ యూనిట్‌గా తీసుకుని సీఎం పోస్టులకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేసే చాన్సుందా..? అంటే… మున్సిపల్ చైర్‌పర్సన్లు, జెడ్పీలకు ఇచ్చినట్టుగానే అన్నమాట… అబ్బో, ఆశ దోశ అప్పడం […]

మల్లాడికి ఆరో విజయం…, తమిళిసైకి ఏడో ఓటమి… కంట్రాస్టు…

May 5, 2026 by M S R

మల్లాడి

. Mohammed Rafee …. ఈ ఎన్నికల్లో ఇద్దరు నన్ను అమితంగా ఆకర్షించారు. ఒకరు డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్, ఇంకొకరు మన తెలుగు తేజం మల్లాడి కృష్ణారావు! మల్లాడి కృష్ణారావు పుదుచ్చేరిలోని యానాం నుంచి వరసగా ఆరవ సారి విజయకేతనం ఎగురవేశారు. తమిళిసై నియోజకవర్గాలు మారుస్తూ ఈసారి తమిళనాడులోని మైలాపూర్ నుంచి పోటీ చేసి ఏడవ సారి ఓటమి చవిచూశారు. మల్లాడి కృష్ణారావు చిన్ననాటి నుంచి సేవాభావంతో పెరిగారు. సొంత భూములు పేదలకు పంచిపెట్టారు! బ్లడ్ […]

మమత అహం మీద ఛెళ్లుఛెళ్లుమని… ఈ ఇద్దరు మహిళల విజయాలు…

May 5, 2026 by M S R

two ladies

. రాజకీయాల్లో Every small thing counts … బెంగాల్‌లో ఓ మహిళ ముఖ్యమంత్రి దారుణ పరాజయం, చివరకు తన సీటులో కూడా స్వీయ ఓటమి ఎంత చర్చనీయాంశమో… ఇద్దరు మహిళల విజయం కూడా ఓసారి చెప్పుకోవాలి… మమత అధికారం విరిగిపడటానికి అనేక కారణాలు ఉండొచ్చు.,. కానీ మరో రెండు కారణాలు, ఆ ఇద్దరు మహిళలూ ఓ కారణమే… ఒకరి పేరు… రేఖ పాత్ర (Rekha Patra)… సందేశ్‌ఖాలీ ఘటనలో బాధితుల తరపున పోరాటం చేసిన ఒక […]

మోడీ అశ్వమేధం… ఒక్కో రాజ్యాన్ని ఆక్రమిస్తూ… కాషాయ సామ్రాజ్యం…

May 5, 2026 by M S R

బీజేపీ

. ఒక పోస్టు కనిపించింది… అమిత్ షా, మోడీ హోమం చేస్తున్నారు… ఇలా హవిస్సులు అర్పిస్తున్నారు… ఉద్ధవ్ థాకరే ……..స్వాహా శరద్ పవార్ ………స్వాహా అఖిలేష్ యాదవ్….స్వాహా నవీన్ పట్నాయక్….స్వాహా లాలూ- తేజస్వీ……..స్వాహా కేజ్రీవాల్……………..స్వాహా తరుణ్ గొగోయ్……..స్వాహా స్టాలిన్………………..స్వాహా మమతా బెనర్జీ………స్వాహా బలమైనా యాంటీ బీజేపీ నేతలను ఒక్కొక్కరినీ… జనమేజయుడి సర్పయాగంలోకి తోసేస్తున్నట్టుగా… కాస్త అతి అనిపించినా సరే… నిజమే… మోడీకి ముందు బీజేపీ… తరువాత బీజేపీ… ఈ కోణంలో ఆలోచిస్తే అనేక అతిరథ మహారథులు కాడి కింద […]

  • « Previous Page
  • 1
  • …
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • …
  • 143
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • సూసైడ్ ఫ్రూటింగ్! నేరేడుపళ్లు విరగకాస్తే సీరియస్ ఎల్‌నినో‌ ఖాయం!?
  • I Stand with Srinidhi Viplava Sri … ఎందుకంటే..?
  • సింగ్ గీతం – బోలెడు బ్లండర్స్, అది ఎక్కడెక్కడ దెబ్బతిన్నదంటే..?
  • కాళ్లల్లో కట్టెలు – ఆత్మరక్షణలో కిషన్‌రెడ్డి – తేలిపోయిన పేలవ వివరణ
  • BRS + Janasena + BJP … తెలంగాణ ద్వేషి పవన్ గోకుతూనే ఉన్నాడు…
  • అంతటి సిల్క్ సయ్యా అనడిగితే… నై అనే బావమరిది ఎవడుంటాడు..?
  • అనుకున్నదే – రక్తికట్టని ‘సింగ్ గీతం’ – మరీ దయనీయం వసూళ్లు
  • A Global Traveller — మోడీ టూర్ల సెంచరీ — 78 దేశాల పర్యటనలు
  • రాజకీయ కలకలం – ఠాక్రేకు మరో భంగపాటు? – జార్ఖండ్‌లో మరో ఘట్టం
  • BJD — పట్నాయక్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం — వారసుల్లేరు, నాయకుల్లేరు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions