. ప్రతిపక్షాల కుట్రను బలంగా తిప్పికొట్టాం అంటున్నాడు రేవంత్… భేష్ అని భుజాలు చరుచుకుంటున్నాడు కానీ నిజం ఏమిటంటే… ప్రధాన ప్రతిపక్షం తను తీసుకున్న గోతిలో తను పడిపోయింది… నిజానికి కాంగ్రెస్ పార్టీని మనం హరాకిరీ పార్టీ అంటుంటాం కదా… ఎవరో హత్య చేయాల్సిన అవసరం లేకుండా తనే ఆత్మహత్య చేసుకుంటుందీ అనే భావనతో… కానీ గత మూణ్నాలుగు రోజుల పరిణామాల్లో పక్కాగా బీఆర్ఎస్ స్వయంగా సూసైడల్ స్ట్రాటజీతో బొక్కబోర్లాపడింది… అసలే అది కిరికిరి పార్టీ… ఏదో […]
ఇదేం ‘యాక్షన్? – హైకమాండ్‌లోనే మద్దతు? ఏం సంకేతాలు ఇవి?
. కారకులు ఎవరైనా, కారణాలు ఏమైనా సరే… రేవంత్ రెడ్డిని బలహీనపరచడం ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ చేజేతులా ఒక రాష్ట్రాన్ని కోల్పోయే పరిస్థితుల్ని క్రియేట్ చేసుకుంటోందా..? జరుగుతున్న పరిణామాలు చూస్తే అదే అనిపిస్తోంది… – రేవంత్ రెడ్డికి ఫ్రీహ్యాండ్ ఇవ్వకపోతే రానున్న కీలకమైన రెండు సంవత్సరాల్లో పార్టీ ఇంకా నష్టపోవడం ఖాయం… ఒక మంత్రిపై యాక్షన్‌కు ఇన్ని మీనమేషాలు, ఇంత తర్జనభర్జన… పైగా ఇంత జాప్యం… ఢిల్లీకి పిలిపించి ‘రాజీనామా చేసెయ్, మరో పదవి ఇస్తాం కేబినెట్ హోదాతో’ […]
అబ్బో.., రేవంత్‌ను కూల్చేస్తే బీఆర్ఎస్ సహకరిస్తుందట !!
. కొండా సురేఖ, ఆమె బిడ్డ వ్యాఖ్యలు, ధోరణులపై గులాబీ క్యాంపు వెటకారం దట్టిస్తూ పెట్టే సోషల్ మీడియా పోస్టులు, లెక్కలు ఎక్కడిదాకా వెళ్లాయంటే… ఓసారి ఈ లెక్క చూడండి… తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం – 66 మిత్ర పక్షం సీపీఐ -1 ఫిరాయింపు ఎమ్మెల్యేలు -10 మరో మిత్రపక్షం ఎంఐఎం-7 కొండా సుస్మితకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టింది ఎమ్మెల్సీలతో కలిపి దాదాపు 18. సో… 66- 16 = 50 మొత్తం సభ్యులు […]
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం మోకాలడ్డు – ఎందుకంటే..?!
. అదుగో పులి- ఇదుగో తోక… రాజకీయాల్లో ఏ వ్యవహారమైనా ఇలాంటి కథనాలకు ఆస్కారమిస్తూనేే ఉంటాయి… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి – తన అధికారిక విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాల్సింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం… కానీ తన అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వలేదు, సో, ముందస్తు ప్లాన్ ప్రకారమే లండన్ పర్యటనను ముగించుకుని, హైదరాబాద్ వచ్చేస్తున్నాడు… కానీ… దీనిపైనా అనుమానాలు, అపోహలు ముసురుకున్నాయి… నిజానికి రేవంత్ రెడ్డి వ్యక్తిగత పర్యటన అయితే ఏ […]
ఏసేశాడు, రేవంత్ రెడ్డి మళ్లీ ఏసేశాడు..! సెటైర్ భలే పేలింది !!
. “TIMS దగ్గరలోని ఓ మెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాడు కేటీయార్… అక్కడ రోగులతో చిట్‌చాట్… నేనే టీఐఎమ్ఎస్ (TIMS) నిర్మించిన వాడిని, నన్ను నువ్వు గుర్తుపట్టలేదా?’ అని అడిగాడు…. దానికి అక్కడున్న ఒక రోగి ఇలా సమాధానమిచ్చాడట… ‘పర్లేదు బాబూ; మొదట్లో నేను కూడా సరిగ్గా ఇలాగే ఏదేదో మాట్లాడేవాడిని… కానీ రానురాను వ్యాధి తీవ్రత తగ్గిపోతుందిలే… అవునూ, ఒకవేళ నువ్వే దాన్ని నిర్మించి ఉంటే, పదేళ్లలో దానిని ప్రారంభించడానికి నీకు టైమే దొరకలేదా మరి..?’ అనడిగాడట […]
రాజగోపాలరెడ్డి ప్రయాణం ఎటువైపు ? హైకమాండ్ సైలెన్స్ ఎందుకు ?
. కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యవహారం తెలంగాణలో కాంగ్రెస్‌కు భారీ నష్టాన్ని కలిగించే దిశకు వెళ్తున్నట్టుంది… కాంగ్రెస్ హైకమాండ్ కళ్లు తెరవకపోతే ఇది పూడ్చలేని అగాధం వైపు తీసుకుపోయేట్టుంది… ఎస్, కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం మరీ మితిమీరి ఉంటుంది… అది బలమో, అదే బలహీనతో తెలియదు గానీ, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ‘కట్టు’ తప్పుతోంది… ఈ దుమారాన్ని టాకిల్ చేయడం పీసీసీ అధ్యక్షుడికి చేతకావడం లేదు, తన రేంజ్ సరిపోవడం లేదు… ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడకూడదు అని తను అన్నాడో […]
కలిసి నడుస్తారా? కైలాట్కమా? – కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ!
. కేంద్ర ప్రభుత్వం @ ఎన్డీయే ప్రభుత్వం @ మోడీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కేవలం పార్టీ కోణంలోనే మాత్రమే చూస్తోందా? తెలంగాణ కూడా తాము పరిపాలించే దేశంలోనే ఓ భాగమేననీ, తెలంగాణ అభివృద్ధి బాధ్యతలో తన పాత్ర కూడా ఉండాల్సిందేననీ విస్మరిస్తోందా? ఇవీ ప్రస్తుత ప్రశ్నలు. హైదరాబాదులో మీటింగు పెట్టిన మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని, కలిసి నడుద్దాం అని పిలుపునిస్తాడు. రాజకీయాలు వేరు- రాష్ట్రం- కేంద్రం నడుమ పాలన సంబంధాలు […]
కొత్త స్కూల్ కిట్..! యాభై ఏళ్ల క్రితం కథ… నేటికి నేరవేరిన ఓ కల..!
. ముందుగా ఓ కథ చెప్పుకుందాం… చివరలో ముగింపు ఏమిటో, అదెంత విలువైందో మీకే అర్థమవుతుంది… సరే, కథలోకి వెళ్దాం పదండి… చాలా ఏళ్ల క్రితం… దాదాపు యాభై ఏళ్ల క్రితం… పాలమూరు జిల్లాలోని ఓ పల్లె… స్కూళ్లు తెరిచే రోజు… ఆ పిల్లాడు సంతోషంగా ఉన్నాడు… బడికెళ్లే హుషారులో ఇల్లంతా సందడిగా తిరుగుతున్నాడు… దగ్గరలోనే బడి, వెళ్లి, క్లాసులైపోగానే, దోస్తులతో ఆటలు… అందుకే ఆనందం… అంతేకాదు, అన్నీ కొత్తవి వస్తాయి, కొత్త యూనిఫాం, కొత్త బ్యాగు, […]
రేవంత్ సవాల్‌కు ఒక్కసారిగా కేటీయార్, హరీష్ సైలెంట్..!!
. రేవంత్ రెడ్డి తన ధోరణి కాస్త మార్చాడు… బీఆర్ఎస్ మీద రాజకీయ దాడిలో ఇప్పుడు కొత్త పంథా చూపిస్తున్నాడు… ఈసారి హరీష్ రావు టార్గెట్… ‘నువ్వు ఏయే పార్టీల వాళ్లతో మాట్లాడుతున్నావో, ఎటు పోతున్నావో నాకు మొత్తం తెలుసు, చెప్పడం నైతికత కాదు కాబట్టి చెప్పడం లేదు, నువ్వు బీఆర్ఎస్‌లో ఉండవు, వచ్చే ఎన్నికల నాటికి మామకు హ్యాండిస్తావు’ అని వ్యాఖ్యానించాడు కదా మొన్న… మైండ్ గేమ్… దీనికి హరీష్ రావు రియాక్టవుతాడనీ తెలుసు… కానీ […]
ఎన్టీయార్ విగ్రహం..! బీఆర్ఎస్ పెడితే గొప్పట..! రేవంత్ పెడితే తప్పట..!!
. అవును…, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు విగ్రహం నగరంలో ప్రతిష్ఠిస్తే తప్పేమిటి..? బీఆర్ఎస్ క్యాంపు నిన్నటి నుంచీ ఉడుక్కుంటోంది… ఆ క్యాంపులోని వాళ్లయితే కొందరు కమ్మ సామాజికవర్గం మీద కూడా ద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు సోషల్ మీడియాలో..! విద్వేష రాజకీయం..! ఎన్టీయార్ కేవలం ఒక కులంతో మాత్రమే ఐడెంటిఫై కాలేదు కదా, అలా ముద్ర వేయడం మాత్రం అన్యాయం… తెలుగు తెరపై వెలిగిన అగ్రనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల వోట్లు గెలిచిన రాజకీయ నాయకుడు, జాతీయ రాజకీయాల్లోనూ […]
ఓ వారసంత నుంచి… ఆ గ్లోబల్ మార్కెట్ దాకా… మన మహిళలు..!!
. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు ఓ నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. అది మహిళ తలెత్తుకుని, ఆత్మగౌరవంతో బతికెే విప్లవం… మహిళా సాధికారత..! ఒకప్పుడు కేవలం ఇంటి పనులకో, పొలం పనులకో పరిమితమైన మహిళలు.. నేడు గ్లోబల్ మార్కెట్లను పలకరిస్తున్నారు… ప్రవేశిస్తున్నారు… వనపర్తి జిల్లా పెబ్బేరు గ్రామానికి చెందిన ఒక సాధారణ మహిళా రైతు ఎనిమిది పెట్టెల ‘మల్లిక’ రకం మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేయడం చిన్న విషయంగా అనిపించవచ్చు… కానీ, ఇది తెలంగాణ గ్రామీణ ఆర్థిక […]
చేతికందిన మక్క పంట కాలిపోయి..! సీఎం స్పందన భేష్..!
. పాలకుడికి మానవతా ధోరణి ఉండాలి… అది ప్రభుత్వ తప్పిదం కావచ్చు, ప్రకృతి విపత్తు కావచ్చు… ఎవరికైనా నష్టం వాటిల్లితే వెంటనే స్పందించి ఆదుకునే హృదయం ఉండాలి…. రేవంత్ రెడ్డి దాన్ని చాటుకున్నాడు… అది అవసరం కూడా… ఎందుకంటే..? ఇలాంటి సందర్భాల్లో, ప్రత్యేకించి రైతులు పంటల్ని తమ తప్పిదం లేకుండా నష్టపోయే సందర్భాల్లో వెంటనే ప్రభుత్వం అండగా ఉంటుందనే సంకేతాన్ని ప్రజలకు, అధికారులకు ఇవ్వడానికి పాలకుడి స్పందన ఉపకరిస్తుంది… అది అధికారగణానికి ఓ డైరెక్షన్… విషయం ఏమిటంటే… […]
సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!
. ఎవరు నారాజ్ అవుతారనేది వదిలేయండి… రేవంత్ రెడ్డి అతి పెద్ద వైఫల్యాల్లో ఒకటి తన ప్రచార విభాగం..! తన ప్రబల ప్రత్యర్థి (పింక్ క్యాంప్) 100 రూపాయల పని చేస్తుంటే, చివరకు పోలీసు కేసుల నుంచి తప్పించుకోవడానికి దుబయ్ క్యాంపులు కూడా నడుపుతూ… తెలంగాణ సమాజం నుంచి దోచుకున్న కోట్లకుకోట్లు వెచ్చిస్తుంటే… రేవంత్ రెడ్డి నయాపైసా మందం చేతకావడం లేదు… గతంలో, కేసీయార్ మెప్పు కోసం ప్రతి ప్రభుత్వ శాఖ ఉరుకులు పరుగులతో… పనిచేతగాకపోయినా ప్రచారాన్ని […]
సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!
. సిద్దిపేటలో గెలిస్తే మంత్రి పదవి ఇస్తా అనే వ్యాఖ్య వెనుక రేవంత్ రెడ్డిది మైండ్ గేమ్… ఈసారి బీఆర్ఎస్ పెద్ద తలల సీట్లను కూడా కొట్టేస్తాం అనే సవాల్ విసరడం… అది కాంగ్రెస్ కేడర్‌లో బూస్టప్… బీఆర్ఎస్‌ను ‘గోకి’ ఇంకేదో ప్రతి సవాల్ దిశగా లాగడం… హరీష్ రావు పడిపోయాడు… వాళ్లో వీళ్లో ఎందుకు, నువ్వే పోటీ చెయ్ దమ్ముంటే అన్నాడు… ‘ నా రేంజ్‌కు నీతో పోటీ దేనికిలే, జాతిపిత అని మోస్తున్నారు కదా, కమాన్, […]
‘కేసీయార్ అమృత హస్తాలు – హరీష్ దివ్యాశీస్సులతో’ అని చెక్కించాలా..?!
. రాజకీయంగా కేటీయార్‌ను వేగంగా దాటేసి, ప్రచారంలో ముందంజలో ఉండాలనే ఆతృతతో హరీష్ రావు పలుసార్లు తన స్థాయికి ఏమాత్రం తగని వ్యాఖ్యలు, ప్రకటనలకూ వెళ్లిపోతున్నాడు… కేసీయార్‌ను నెత్తిన మోయడం వరకు వోకే, అర్థం చేసుకోవచ్చు కానీ, కొన్ని హేతురహిత వ్యాఖ్యలతో తనలోని విజ్ఞుడైన రాజకీయ నాయకుడిని తనే కుదించుకుంటూ… మరో కౌశిక్‌రెడ్డి అయిపోతున్నాడా..? ఉదాహరణకు… తెలంగాణ సీఎం ప్రారంభించబోతున్న నర్మెట్ట ఆయిల్ పామ్ ప్లాంటు గురించి…!! తనేమంటాడంటే..? ‘‘మేమే నిర్మించాం, కానీ రేవంత్ రెడ్డి తన […]
రేవంత్ రెడ్డి కొత్త చదువు ఎందుకు స్పెషల్..? ఏమిటి ఈ కొత్త పాఠాలు..!!
Revanth Reddy and his study at Kennedy school. Why this is special?
మర్యాద రేవంతన్న..! గౌరవనీయ కేసీయార్..! ప్రొటోకాల్ పాలిటిక్స్..!!
. రేవంత్ రెడ్డి అందరికీ అర్థం కాడు… తనను అంచనా వేయడం కేసీయార్‌కే సాధ్యం కావడం లేదు… అప్పుడే కేసీయార్‌ను ఉరితీసినా తప్పు లేదు అంటాడు… వెంటనే అసెంబ్లీకి వచ్చిన కేసీయార్‌కు కరచాలనం చేసి, ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరిస్తాడు… అప్పుడే కేసీయార్‌ను కసబ్‌తో పోలుస్తాడు… వెంటనే కేసీయార్ తనకుతానే శిక్ష వేసుకున్నాడు, సొంత ఇల్లే బందిఖానా, ఇంకా శిక్షించేదేముంది..? దేవుడా శిక్షించాడు అని క్షమాభిక్ష ప్రకటించేస్తాడు… అప్పుడే హాస్పిటల్‌కు వెళ్లి కేసీయార్‌ను పరామర్శిస్తాడు… తరువాత […]
‘పాలమూరు పాపం’లో కేసీయార్, హరీష్ ఫిక్స్…. రేవంత్ ‘సిట్’..!
. పాలమూరు- రంగారెడ్డి …. నీళ్లలో నిప్పు రాజుకుంది… హరీష్ రావు ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి అంతకన్నా ఘాటుగా కౌంటర్లు,, ఆరోపణల డోస్ పెంచుతున్నాడు… కొత్త ప్రశ్నల్ని సంధిస్తున్నాడు… హరీష్ రావు, కేసీయార్ జాయింటు జలనిర్వాకాల్ని మరింతగా ఎక్స్‌పోజ్ చేస్తున్నాడు… నిన్న రేవంత్ రెడ్డి ప్రధాన విమర్శ ఏమిటంటే..? ‘‘హరీష్, కేసీయార్ చేసిన ద్రోహాలకు వాళ్లిద్దర్నీ ఉరితీసినా తప్పులేదు… ఇవే తప్పులు మిడిల్ ఈస్ట్‌లో చేస్తే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు… పాలమూరు – రంగారెడ్డి […]
కీలకమైన నదీజలాల వివాదాలపై… హరీష్‌రావు అబద్దపు బాష్యాలు…
. ఎంతగా కేసీయార్ ట్రెయినింగ్ అయినా సరే, ఇన్నాళ్లూ హరీష్ రావు కాస్త హేతుబద్దంగా, జనం నవ్వకుండా ఉండేలా కాస్త పద్ధతిగా మాట్లాడతాడని అనుకునేవాళ్లకు తీవ్ర నిరాశ, విస్మయం… తను కేటీయార్‌ను మించిపోయాడు పద్దతిరాహిత్యంలో..! నిన్నటి తన ఇరిగేషన్ ప్రెస్‌మీట్ నిండా అబద్దాలు, వితండ బాష్యాలతో ఉంది… మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇరిగేషన్ సబ్జెక్టును వదిలేసింది కాబట్టి, హరీష్ రావు మాటల్లో అబద్ధాల్ని పట్టుకోలేకపోతోంది… పట్టుకోగలిగినా విశ్లేషణలు లేవు… సరే, కొన్ని నిజాల్లోకి వెళ్దాం.,. తన పాయింట్లు, […]
సంస్కారం, మర్యాద, పరిణతి… రేవంత్ రెడ్డి తలెత్తుకున్నాడు కేసీయార్ ఎదుట..!!
. బహుశా కేసీయార్ ఊహించి ఉండడు కలలో కూడా..! తను అనేకానేక కేసులు పెట్టి వేధించినా సరే, కక్షపూరితంగా వ్యహరించినా సరే… రేవంత్ రెడ్డి అవన్నీ మనసులో పెట్టుకోకుండా, అసెంబ్లీకి ఏదో తప్పనిసరి తంతులాగే వచ్చినా సరే, సాదరంగా కరచాలనం చేస్తాడని… ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడని… ఊహించి ఉండడు, తన దొరతనం అంచనా వేసి ఉండదు… మంత్రులతో సహా మొత్తం కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా ఒక్క వెకిలి మాటతో ర్యాగింగు చేయకుండా వచ్చి తనను పలకరిస్తారని… […]



















